రివర్స్ గేర్ లో త్రిష
తమపై వచ్చే రూమర్స్ అంటే హీరోయిన్స్ మండిపడుతూంటారు. అయితే త్రిష మాత్రం అందుకు పూర్తి భిన్నంగా బిహేవ్ చేస్తోంది. రూమర్స్ గురించి మీడియాతో మాట్లాడుతూ..''హీరోయిన్స్ కు ప్రచారం చాలా ముఖ్యం. పైగా ఈ మధ్య ఏడాది కాలంగా నేను నా హడావిడితో పత్రికలవాళ్లకి కాస్త దూరంగా ఉంటున్నాను. అందుకే ఎవరికి తోచింది వాళ్లు రాస్తూనే ఉన్నారు. మనం చెప్పామా? కాదా? అన్నది ముఖ్యం కాదు. నటిగా వార్తల్లో ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రత్యేకించి నా సమయం వృథా కాకుండా నా గురించి పుకార్లు పుట్టించి ప్రచారం చేసేవాళ్లున్నందుకు చాలా సంతోషంగా ఉంది.వారికి నా కృతజ్ఞతలు..అలాగే ఎవరో ఏదో రాస్తున్నారని హడలెత్తిపోయే స్వభావం కాదు నాది.''అంటూ ముగించింది. త్రిషకూ, శింబుకూ రిలేషన్స్ ఉన్నాయంటూ ఆ మధ్యన అన్ని పత్రికల్లోనూ హోరెత్తింది.ఇక ప్రస్తుతం త్రిష వెంకటేష్ సరసన నమో వెంకటేశ చిత్రంలో చేస్తోంది. రీసెంట్ గా గోపీచంద్ తో చేసిన శంఖం చిత్రం భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాన్ని చూపింది.


Click it and Unblock the Notifications











