Just In
- 8 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
- 35 min ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
- 46 min ago
అలా చేయడం వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు.. కోహ్లీ, తమన్నాలకు హైకోర్టు నోటీసులు
- 1 hr ago
మెహబూబ్ గుట్టు విప్పిన సోహెల్: అందుకే పైకి అలా కనిపిస్తున్నాడంటూ మేటర్ రివీల్ చేశాడు
Don't Miss!
- News
పిక్చర్ అభీ బాకీ హై... అది భగవంతుడికే తెలియాలి... దీప్ సిధు వివాదాస్పద వ్యాఖ్యల ఆంతర్యం..?
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Sports
BWF World Tour Finals 2021: శుభారంభం దక్కలేదు.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సింధు, శ్రీకాంత్ ఓటమి!
- Lifestyle
శరీర బరువును వేగంగా తగ్గించే ఈ పుదీనా టీని ఎలా తయారు చేయాలి??
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అతని కనెక్షన్ ఉందనే త్రిష పెద్ద సినిమాకు నో
చెన్నై : త్రిష ఇప్పుడు వరస పెట్టి సినిమాలు ఒప్పుకుంటోందంటున్నారనే దాంట్లో నిజమెలా ఉన్నా...సినిమాలు మాత్రం వదిలేయటం మాత్రం జరుగుతోంది. తన ఫార్మల్ ఫియాన్సీ..వరుణ్ మారియన్ తో కనెక్షన్ ఉన్న ప్రతీ ప్రాజెక్టుకు ఆమె బై చెప్పేస్తోంది. తాజాగా ఈ చెన్నై బ్యూటీ...సెల్వ రాఘవన్ చిత్రం ఒప్పుకున్నట్లే ఒప్పుకుని ఇప్పుడు నో చెప్పేసి...తప్పుకుందని చెన్నై వర్గాల సమాచారం. దానికి కారణం ..వరుణ్ మారియన్ ...ఆ ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేయటమే అని తెలుస్తోంది.
తమిళ,తెలుగు అనే తేడా లేకుండా ... సినీ పరిశ్రమలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని దాటుకుని దిగ్విజయంగా దూసుకెళ్తున్న నటి త్రిష. ప్రస్తుతం ఆమె శింబు హీరోగా నటించనున్న సినిమాకు హీరోయిన్ గా ఎంపికయినట్లే అయ్యి వదిలేయంటం అంతటా చర్చనీయాంశంగా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'అలై', 'వినైతాండి వరువాయా' చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారనే అభిమానుల ఆనందం ఎంతో సేపు నిలవనీయలేదు.
ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే సెల్వరాఘవన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతం సమకూర్చనున్నారు. 'లింగ' చిత్రంలో విలన్‌గా కనిపించి ఆకట్టుకున్న తెలుగు నటుడు జగపతిబాబు ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారు. మే ద్వితీయ వారంలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. అయితే త్రిష తప్పుకోవటంతో ఇప్పుడు వారు హీరోయిన్ వేటలో పడ్డారని తెలుస్తోంది. ఈ సినిమాకు అరవింద్ కృష్ణ సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.
గత కొద్ది రోజులుగా త్రిష- వరుణ్ మణియన్‌ల పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య పెళ్లికి ముందే అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయినట్లు సిని,మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ నేపధ్యంలో వీరి సన్నిహితులు ముందుకు వచ్చి...వీరిని కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చిన్న చిన్న అభిప్రాయ భేధాలు ఎవరి మధ్య అయినా సహజమేనని, సర్దుకుపోవాలని రాజీ చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
వరుణ్ మణియన్ ...రాజీకు ఇష్టపడినా, త్రిష మాత్రం పట్టుదలగా ఉందని అంటున్నారు. అయితే అసలు వీరిద్దరి మధ్యా ఏం జరిగింది.. అప్పుడే ఎందుకు విడిపోయాలి అనే ఆలోచనకు అప్పుడే ఎందుకు వచ్చారనేది మాత్రం అర్దం కావటంలేదని అంటున్నారు. కానీ సన్నిహితులు మాత్రం...వీరిద్దరూ కలిసి ట్విట్టర్ ద్వారా కానీ ,మీడియా ద్వారా కానీ స్పందిస్తే బాగుంటుందని సూచిస్తున్నారట.
త్రిష.. చిత్ర నిర్మాత వరుణ్ మణియన్‌తో ప్రేమాయణం సాగించి, నిశ్చితార్థం చెన్నైలో ఈ ఏడాది జనవరి 23న జరిగింది. ఆ తర్వాత సినీ ప్రముఖులు, స్నేహితులకు ఓ నక్షత్ర హోటల్‌లో విందు కూడా ఇచ్చారు. ప్రస్తుతంఅంతేకాకుండా కొన్ని ప్రముక తమిళ పత్రికలు కూడా వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు ప్రచురించాయి.
ఇటీవల వరుణ్‌మణియన్ చెల్లెలు వివాహానికి కూడా త్రిష హాజరు కాలేదని, అంతేకాకుండా త్రిష తన చేతిలో ఉన్న నిశ్చితార్థ ఉంగరాన్ని కూడా తీసేశారన్నది ఆ వార్తల సారాంశం. మరోవైపు వీరిద్దర్నీ కలిపేందుకు సన్నిహిత స్నేహితులు ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
త్రిషకు వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థానికి ముందు పెద్దగా చిత్రాలు లేవు. అంతకుముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత త్రిష నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదలైన హిట్ అవ్వడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. మేనేజర్ గిరిధర్ నిర్మిస్తున్నారు. త్రిష చిత్రాలు మీద చిత్రాలు అంగీకరించడంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం రాసింది. అయితే ఈ వ్యవహారం గురించి ఇటు త్రిషగాని, అటు వరుణ్‌మణియన్‌గాని స్పందించక పోవడం గమనార్హం.
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో హవా చాటుకుంటున్న త్రిష.. ఇప్పటికీ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. తెలుగులో బాలకృష్ణ సరసన ఆమె నటించిన 'లయన్' త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళంలోనూ కొత్తగా రెండు చిత్రాల్లో నటిస్తోంది.