మొత్తానికి త్రిష బికిని వేయటానికి ఒప్పుకుంది.ఆ నిర్ణయం తీసుకుని వేస్తుందా వెయ్యదా అనే టెన్షన్ నుండి చాలా మందికి విముక్తి కలిగించింది.అసలు ఈ గొడవ నయనతార బికిని వేసి అజిత్ తో డాన్ రీమేక్ 'భిల్లా' లో నటించటంతో స్టార్ట్ అయ్యింది.అంతేగాక ఆమె వేసుకున్న బికిని రెండు లక్షలకు కూడా అమ్ముడు పోయిందిట.అంతే అదో పెద్ద సెన్సేషన్ న్యూస్ అయి కూర్చుంది.ఎక్కడ చూసినా ఆ వార్తలే ...చర్చలే .దాంతో ఆమెతో పోటీ పడుతున్న త్రిష కి కంగారు పుట్టుకొచ్చింది.అంతేగాక మిగతా హీరోయిన్లు కూడా ఈ ట్రెండ్ ని ఫాలో అవటానికి రెడీ అవటం,స్టేట్ మెంట్స్ ఇవ్వటం తో అదిరిపోతోంది.ఇదంతా చూసి పోటీలో ఉండాలి అంటే బికినీవి ఆశ్రయించక తప్పదని ప్రిపేరయి...అవకాశమొస్తే ఆలోచిస్తాను అంటోందిట.ఎవరో ఒక దర్శకుడో,నిర్మాతో ఆ పుణ్యం కట్టుకోండని ఆమె అభిమానులు మొక్కుకుంటున్నారు.