అజిత్ బిర్యాని అదుర్స్ ...పిచ్చాపాటిగా తిన్నా: త్రిష
అజిత్ ఏం చేస్తాడు? ..మహా అయితే నటిస్తాడు. మిగతా హీరోలతో పోల్చి చూస్తే..కొత్తగా, భిన్నంగా ఏదైనా చేస్తాడు! సినిమా సినిమాకి వేషాలు మార్చి నవ్య రూపంతో ఆశ్చర్యపరుస్తాడు. ఏమాత్రం అవకాశం చిక్కినా 'గ్యాంబ్లర్"గా మారి బెట్టింగు రాయుళ్ల సొమ్మును దారి కాసి స్వాహా చేస్తాడు. మనకి తెలిసింది ఇంతవరకే! కానీ బూరె బుగ్గల త్రిషకు ఇంకా చాలానే తెలుసు! ''అజిత్ ఓ మంచి కుక్. బిర్యానీ వండడంలో తనకి సాటి లేనే లేరు! స్వయంగా తను తయారు చేసిన బిర్యానీ ఓ సారి రుచి చూశామంటే చాలు..ఇక మళ్లీ మళ్లీ దాని కోసం ఎదురుచూడాల్సిందే.
సెట్ లో అజిత్ క్యారియర్ విప్పగానే..బిర్యానీ సువాసనలు అద్దిరిపోతాయి. చుట్టూ జనాలు ఉన్నారా లేరా..అనేది కూడా చూడం. వెంటనే క్యారియర్ అందుకుని అందులోని బిర్యానీని లొట్టలు వేసుకుని తినేస్తాం. మాంగత్త (తెలుగులో -గ్యాంబ్లర్)..చిత్రీకరణ జరుగుతుండగా నేను రోజూ అలానే చేసేదాన్ని"" అని తన స్వీయానుభవా లను చెప్పుకొచ్చింది ఈ చిన్నది. అజిత్ చేతివంట తిన్న తర్వాత తనకి పెద్ద అభిమానిగా మారిపోయానని అంటోందీ భామ. నోరూరేలా చెప్పింది కదూ!


Click it and Unblock the Notifications











