రబ్బర్ ని చాక్లెట్ అనుకుని మింగా... త్రిష
"ఒకసారి నా చేతికి రబ్బర్ దొరికింది. చేతికి అందిన తర్వాత అదేంటో చూడాలి కదా. నేనా పని చేయలేదు. అది చాక్లెట్ అనుకుని నోట్లో వేసుకుని నమిలి, మింగిపారేశాను అంటూ తన చిన్న తనాన్ని గుర్తు చేసుకుంది త్రిష. అలాగే తను స్కూల్లో చాలా అల్లరి చేసేదాన్నని..తన అల్లరికి అందరూ భయపడేవాళ్ళని, తన తోటి పిల్లలని తెగ ఏడిపించి భయపెట్టేదాన్నని, ఇప్పుడవన్నీ తల్చుకుంటే నవ్వొస్తోందని త్రిష అంటోంది.
ఇక ఇప్పుడు ఎవరికైనా క్షమాపణలు చెప్పే అవకాశం వస్తే మీరెవరికి చెబుతారు? అనే ప్రశ్నను త్రిష ముందుంచినప్పుడు-"పేరు పేరునా చెప్పాలంటే బారెడు లిస్ట్ తయారవుతుంది. నేను మంచి అమ్మాయినే కానీ కొంచెం కోపం ఎక్కువ. నా ఆత్మీయుల దగ్గర ఆ కోపాన్ని ప్రదర్శించేస్తుంటాను. అలా నా ఆగ్రహానికి గురైనవాళ్లందరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది' అన్నారు. ఇక త్రిష ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన కట్టా మీటా చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











