»   » అవకాశాల్ని అందిపుచ్చుకుంటోన్న త్రిష...దశ తిరుగుతోంది...

అవకాశాల్ని అందిపుచ్చుకుంటోన్న త్రిష...దశ తిరుగుతోంది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాట మళ్ళీ నెంబర్ వన్ హీరోయిన్ గా ఇప్పుడు త్రిష పేరు ప్రముఖంగా వినిపింస్తోంది. తమన్నా టాలీవుడ్ పై కన్నేయడం, అనుష్క సైతం కోలీవుడ్ మీద ఇంట్రెస్ట్ తగ్గించడంతో, తమిళ దర్శక నిర్మాతలకు అందుబాటులో వుంటూ, అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది త్రిష.

'తీన్ మార్" సినిమాతో టాలీవుడ్ లో అనూహ్యమైన షాక్ తిన్నా నాలుగైదు సినిమాలతో టాలీవుడ్ లో త్రిష బిజీగానే వుంది. బాలీవుడ్ లోనూ త్రిష రెండు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెల్సిందే. ప్రస్తుతానికి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి, ఇకపై పూర్తిగా కోలీవుడ్ పై దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యిందట త్రిష. విక్రమ్ తో ఓ సినిమా, సూర్య తో ఓ సినిమా, కమల్ తో మరో సినిమా అజిత్ తో ఓ సినిమా..ఇలా త్రిష చేతిలో ఇప్పుడు ఆఫర్లు బాగానే ఉన్నాయట. మాతృభాషలో మళ్ళీ బిజీ అవుతున్నందుకు ఆనందంగా వుందనీ, ఇకపై తమిళ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడ్తానని త్రిష చెబుతుండడం గమనార్హం.

అయితే త్రిష గ్లామర్ తో పోల్చితే అనుష్కపైనే తమిళ దర్శక నిర్మాతలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండడం గమనార్హం. అనుష్క మాత్రం, సెలక్టెడ్ గా సినిమాలు చేస్తుండడం, తెలుగుపై అనుష్క ఎక్కువ ఇంట్రెస్ట్ చూసుతుండడం కాస్తా త్రిషకి బాగా కలిసొస్తోంది.

English summary
Recently, the petite beauty Trisha was sharing her thoughts when she revealed that she wanted to be part of Mankatha since it was a multi-starrer and also because she likes director Venkat Prabhu's work. She reiterated that Bollywood is in the backseat as she is focusing on Tamil..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu