త్రిషకి తన బాత్రూం క్లిప్పింగ్స్ నెట్ లో రావటంతో అప్పటి నుంచి ఎక్కడ కెళ్ళినా రకరకాలుగా చెక్ చేసి అక్కడ దిగుతోంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టెక్నాలిజీ ముందు అవేమీ పనిచేయమని అందరూ చెప్పటంతో ఆమె ఓ సెక్యూరిటీ సిస్టమ్ ని కొనుగోలు చేసింది. దాని విలువ కోటి రూపాయలు అని సమాచారం. అది తనతో ఉండటం తో ఎటువంటి కెమెరాలనయినా ఎదుర్కోగలనని ధీమా వ్యక్తం చేస్తోంది. కోటి పోయినా వంద కోట్ల మనస్సాంతి లభిస్తుందని మురుసిపోతోంది. ఎందుకంటే చివరకు తన సొంత ఇంటిలో కెమెరా పెట్టినా తెలుసుకోవటం కష్టమని, ఈ సెక్యూరిటీ సిస్టమ్ ని ఆన్ చేసి ఉంచితే చాలని అంటోంది. ఇక ఇంత ఖరీదైన వస్తువుని దాచటం మరో కష్టమని ఆమె శ్రేయాభిలాషులు అంటున్నారు. ఎప్పుడూ దృష్ఠి దాని మీదే ఉంచాలని అదమరుపుగా ఉంటే కోటి పోయినట్లే నంటున్నారు. ఎలకలు ఉన్నాయని పిల్లిలను తెచ్చి, వాటిని పట్టుకోవటానికి కుక్కని పెంచాల్సిన స్ధితి వస్తుందేమో అంటున్నారు. అదీ త్రిష కోటి రూపాయల భయం.