త్రిష బ్యాంక్ అకౌంట్ హ్యాక్...రూ. 1 కోటి గోవిందా
హీరోయిన్ త్రిష బ్యాంక్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ఇందులోంచి దాదాపు రూ. కోటి రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగి పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారిగా కోటి రూపాయలు గోవిందా కావడంతో త్రిష ఒక్రసారిగా షాక్ గురైంది. డబ్బు మిస్సింగ్ విషయమై బ్యాంకు అధికారులు విచారణ జరుపుతున్నారు.
చెన్నయ్‌లోని అన్నా సెలై ప్రాంతంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో త్రిషకు అకౌంట్ ఉంది. చాలా ఏళ్లుగా ఆ బ్యాంకులో ఖాతా ఉండటం, నమ్మకమైన బ్యాంకు కావడంతో కొన్ని వారాల క్రితమే అందులో భారీ మొత్తంలో త్రిష డబ్బును డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. అకౌంట్ నుంచి డబ్బు మిస్ కావడంతో ఆమె బ్యాంకు అధికారులను నిల దీయగా... పోలీస్ కంప్లైంట్ ఇవ్వ వద్దని, త్వరలోనే మీ సమస్యను సాల్వ్ చేసి డబ్బు తిరిగి వచ్చేలా చేస్తామని భరోసా ఇవ్వడంతో త్రిష కూడా పోలీలను ఆశ్రయించ కుండా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
త్రిష సినిమాల విషయానికొస్తే...ఆమె తెలుగులో చివరగా నటించిన 'దమ్ము' చిత్రం అనుకున్న అంచనాలను చేరుకోక పోవడంతో అమ్మడు మళ్లీ కాస్త వెనకబడిపోయింది. ప్రస్తుతం ఆమె మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. విశాల్ సరసన 'సమర్' చిత్రంతో పాటు...జయంరవి సరసన 'భూలోగం' చిత్రంలో, హీరో జీవాతో కలిసి 'ఎండ్రెండ్రుమ్ పున్నాగయ్' చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











