‘మోహిని’గా త్రిష: ట్రైలరే ఇలా ఉంటే, థియేటర్లో వణుకే..
గతేడాది 'నాయకి' అనే కామెడీ హారర్ ఫిల్మ్‌లో కనిపించిన హీరోయిన్ త్రిష త్వరలో 'మోహిని'గా ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తోంది. సీరియస్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
భయపెట్టిన ట్రైలర్
తాజాగా విడుదలైన ‘మోహిని' ట్రైలర్ ప్రేక్షకులను భయపెడుతోంది. గ్రాఫిక్స్ హై క్వాలిటీతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ సినిమాను థియేటర్లలో చూస్తే భయంతో వణికి పోవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మోహిని
‘మోహిని' చిత్రానికి ఆర్ మాదేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ లండన్ లో జరిగింది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్లనే 2016లో మొదలైన ఈ చిత్రం చాలా లేటవుతూ వచ్చింది.

త్రిష విశ్వరూపం
నటిగా త్రిషకు ఇప్పటికే మంచి పేరుంది. అయితే ఈ సినిమాలో వివిధ షేడ్స్ ఉన్న పాత్రల్లో తన నట విశ్వరూపాన్ని చూపించబతోందని అంటున్నారు.

భారీ బడ్జెట్ మూవీ
‘మోహిని' చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసేందకు ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా హారర్ సినిమాలకు పెట్టే బడ్జెట్ కంటే ఈచిత్రానికి కాస్త ఎక్కువే ఖర్చు చేశారు.


Click it and Unblock the Notifications











