త్రిష స్పెషల్ సాంగ్ చేస్తోంది
చెన్నై : హాట్ హీరోయిన్ త్రిష ఐటం సాంగ్ చేస్తోందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అయితే ఆమె చేసేది ఐటం సాంగ్ కాదు కేవలం ఓ స్పెషల్ సాంగ్ అంటున్నాయి ఆ సినిమా యూనిట్ వారు. ఏది ఎలా ఉన్నా త్రిష తన అభిమానులకు ఆనందం కలిగించేలా స్పెషల్ లేదా ఐటం సాంగ్ చేస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు..అజిత్ తో గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న చిత్రం. ఈ చిత్రం అనుష్క హీరోయిన్ కావటం విశేషం. ఈ విషయాన్ని తన మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ తెలియచేసారు.
'తల' అజిత్ 55వ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆ సినిమాకు పేరుపెట్టకపోయినా.. 'తల - 55' పేరుతో ఇప్పటికే పోస్టర్లు, బ్యానర్లు నగరంలో భారీగా దర్శనమిస్తున్నాయి. గౌతంమీనన్ దర్శకత్వంలోని ఈ సినిమాలో అనుష్క కథానాయిక. త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇందులో ఆమె ఓ ప్రత్యేక గీతంలో చిందులేసినట్లు సమాచారం.

గౌతంమీనన్ దర్శకత్వంలో 'కాక్క కాక్క' వంటి పలు సినిమాలలో అవకాశాలు వచ్చినా.. కొన్ని కారణాల వల్ల అజిత్ నటించలేదు. చాలా కాలం తర్వాత వారి కాంబినేషన్లో యాక్షన్ కథాంశంతో దీన్ని తెరకెక్కించారు. అజిత్ పోలీసు పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ డాన్ మెక్కాతర్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.
షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. క్లెమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, కొన్ని ప్యాచ్ సన్నివేశాలే ఉన్నాయి. ఈ నెలాఖరులో సినిమా పేరు ప్రకటించి.. ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











