»   » తన అశ్లీల ఫొటోలమీద త్రిష ఇలా చెప్పింది

తన అశ్లీల ఫొటోలమీద త్రిష ఇలా చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సింగర్ సుచిత్ర కార్తీక ట్విట్టర్ పేజీ ద్వారా రెండు మూడు రోజులుగా సౌత్ సెలబ్రిటీలకు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు....ఇతర స్టార్లతో వారు చేస్తున్న రొమాన్స్ ఫోటోస్ లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ అల్లుడు ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సింగర్ చిన్మయి, రానా, త్రిష, హన్సిక ఇంకా పలువురి ఫోటోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఇక హీరోయిన్ సంచితశెట్టికి సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు కూడా లీక్ అవ్వడం మరోసారి ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది.

దశాబ్దానికిపైగానే హీరోయిన్‌గా కొనసాగుతున్నా ఇప్పటికీ క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటోంది చెన్నై చిన్నది త్రిష. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిషను హఠాత్తుగా వార్తల్లోకి లాగింది సింగర్‌ సుచిత్ర ట్విట్టర్‌ ఖాతా. ధనుష్‌, రానాలతో త్రిష కిస్సింగ్‌ ఫొటోలను సుచిత్ర తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. త్రిషతోపాటు ఇతర హీరోహీరోయిన్ల ఫొటోలు, వీడియోలు కూడా సుచీలీక్స్‌ కారణంగా బయటకు వచ్చాయి.

కానీ, వారెవరూ స్పందించలేదు. త్రిష మాత్రం 'కర్మ' గురించి కోట్‌ చేసి ఇండైరెక్ట్‌గా సుచీలీక్స్‌ గురించి స్పందించింది. 'పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కూర్చుని విశ్రాంతిగా చూస్తూ ఉండండి. మిమ్మల్ని బాధపెట్టిన వారు.. వారంతట వారే నాశనం అయిపోతారు. మీకు అదృష్టం ఉంటే.. వాళ్ల నాశనాన్ని మీ కళ్లతో చూసే అవకాశం దేవుడు మీకు ఇస్తాడు' అంటూ చాలా ఘాటుగా స్పందించింది త్రిష. సుచీలీక్స్‌పై త్రిష ఎంత కోపంగా ఉందో ఈ పోస్ట్‌ చూస్తేనే తెలిసిపోతోంది.

English summary
"No Need for revenge., just sit back and weyit, those who hurt you woll screw up themselves and if you are lucky, God will let you watch." Tweets Trisha krishnan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu