ఆయన ప్రక్కన కూర్చోవటమే అదృష్టం: త్రిష
ఎఆర్ రహమాన్ పక్క కుర్చీ నాదే అని ముందుగానే నాకు తెలుసు. అయితే ఆయన్ని చూడగానే స్థాణువులా అలా నిలబడిపోయాను. తడపడిపోయాను. రహమాన్ నే చూస్తుండిపోయాను. ఎంతో ఎమోషన్‌కి గురయ్యాను. ఆయనంటే నాకంత అభిమానం. కొన్ని క్షణాలు అదో లోకంలో విహరించిన తర్వాత కాసేపటికి తేరుకున్నాను. రహమాన్ పక్కనే కూర్చున్నాను. మెల్లిగా మాటలు సాగాయి. రహమాన్ గొప్ప సంగీత దర్శకుడైనప్పటికీ ఆయన మామూలు వ్యక్తిలా ప్రవర్తించారు...అంటూ త్రిష ఎమోషనల్ గా చెప్తోంది. ఆమె లేటెస్ట్ గా తమిళ చిత్రం 'విన్నైత్తాండి వరువాయా' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిమిత్తం లండన్‌లో వెళ్ళారు. అక్కడ విషేషాలను ఆమె మీడియాకు వివరించింది. ఇక ఆ ఆడియో వేడుక జరిగినంతసేపూ రహమాన్ ఏదో ఒక జోక్ చెప్పి నవ్వుతూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ రోజు జరిగిన ఆడియో వేడుకకు రహమాన్ 'లైఫ్' అయ్యారని చెప్పొచ్చు..అంత గొప్ప వ్యక్తి అయినా ఆయన సింప్లిసిటీ..సెన్సాఫ్ హ్యూమర్ అద్బుతమనిపిస్తాయి' అన్నారు త్రిష. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రానున్న చిత్రంలో శింబు హీరోగా చేస్తున్నారు..త్రిష హీరోయిన్ గా చేస్తోంది.అలాగే ఆమె శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించిన నమో వెంకటేశ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఇక గౌతమ్ మీనన్ ఇదే చిత్రాన్ని నాగచైతన్యతో రీమేక్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











