మూడు రోజులు కుక్కని ప్రక్కలో పడుకోపెట్టుకున్నా...త్రిష
మూడు రోజుల పాటు ఆ కుక్కని పక్కలోనే పడుకోపెట్టుకున్నాను. దానికి ఒంట్లో బాగోలేదనే ఆ పని చేయాల్సి వచ్చింది అంటోంది త్రిష. ఈ విషయమై వివరిస్తూ...క్రిందటి వారం త్రిష చాలా టెన్షన్ గా గడిపానని చెప్తోంది. దానికి కారణం జోయా. తన ముద్దుల కుక్కపిల్ల. దానికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తాను చాలా టెన్షన్ కు గురయ్యానంటోంది. షూటింగ్స్, పార్టీలను అన్నిటినీ పక్కన పెట్టి జోయాని ఆస్పత్రికి తీసుకెళ్లింది. చిన్న ఆపరేషన్ చేస్తే జోయా కోలుకుంటుందని డాక్టర్ చెప్పడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించి ఆపరేషన్ చేయించేసింది.
ఆ విషయం గురించి త్రిష చెబుతూ సర్జరీ జరిగిన రోజు జోయా పడిన బాధ చూసి నా మనసు విలవిల లాడింది. రాత్రంతా నిద్రపోకుండా తను బాధపడుతూనే ఉంది. నేను కూడా నిద్రపోలేదు. ఇప్పుడు ఫర్వాలేదు. మునుపటిలా చలాకీగా ఉంటోంది అన్నారు. అలాగే నేను షూటింగ్స్ కోసం ఊళ్లు పట్టుకుని తిరుగుతాను కదా. ఆ గ్యాప్ లో జోయాని బాగా మిస్ అవుతున్నట్లనిపించింది. తను కూడా అంతే. నేను ఇంట్లో అడుగుపెట్టగానే నా కాళ్లను చుట్టేస్తుంది. ఎత్తుకునే వరకు నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అని మురిసిపోతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం త్రిష...పవన్ కళ్యాణ్ సరసన లవ్ లీ అనే చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











