త్రిష్ స్పెషల్ కేర్
క్యూట్ గా కనిపించే త్రిష హిందీ చిత్రం 'కట్టా మీటా" లో కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ 1 నుంచి ఆరంభం కానుందని వినికిడి. ఈలోపు బాలీవుడ్ కి తగ్గట్టుగా తయారవ్వడానికి త్రిష సన్నాహాలు మొదలు పెట్టింది. కఠినమైన ఆహార నియమాలు, వర్కవుట్లు చేస్తోందట. వీటితో పాటు రోజూ యోగా కూడా చేస్తోందని వినికిడి. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన నమో వెంకటేశా చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్ సరసన 'శంఖం" సినిమాలో నటించిన త్రిష ఆ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకుంది.
తెలుగులో అనుష్క, ఇలియనా, కాజల్ కి హీరోయిన్ గా మంచి డిమాండ్ రావడంతో తనకు అవకాశాలు తగ్గిపోతాయన్న కోణంలోనే త్రిష తన రెమ్యునరేషన్ని తగ్గిచుకునేందకు సిద్దమవుతున్నట్లు సమాచారం. 'శంఖం" సినిమా సక్సన్ అయితే మళ్ళీ రెమ్యునరేషన్ని పెంచే విషయమై నిర్ణయం తీసుకుంటుందట. తప్పదుమరి డిమాండ్ వున్నప్పుడు రేటు పెంచేసినా, డిమాండ్ తగ్గితే రేటు తగ్గించేయాల్సిందే.


Click it and Unblock the Notifications











