త్వరలోనే కోలుకుని హంగామా చేస్తా: త్రిష
ఎన్టీఆర్ తో చేసిన 'దమ్ము' తరవాత త్రిష ఓ నెల రోజులు పాటు రెస్ట్ తీసుకోవాలని స్నేహితులతో కలిసి ధాయలాండ్ వెళ్లింది. అక్కడ ఉన్నంత సేపూ బాగానే ఎంజాయ్ చేసింది. కానీ వచ్చేటప్పుడు మాత్రం విపరీతమైన జ్వరంతో ఇంటికి వచ్చింది. దాంతో ఇప్పుడు ఏ పని చేయకుండా ఇంట్లోనే మంచం దిగకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటోంది. ఆమె తల్లి ఆమెకు సపర్యలు చేస్తోంది. అయితే ఈ రెస్ట్ బాగా బోర్ కొడుతోందంటోంది త్రిష.
ఆమె మీడియాతో ఈ విషయమై మాట్లాడుతూ...''ఇప్పుడు ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉన్నాను. నా గదిలో టక్ టక్ టక్‌మంటూ గడియారం శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. అమ్మ దగ్గరుండి నాకు సపర్యలు చేస్తోంది. త్వరలోనే కోలుకొని హంగామా చేస్తాను'' అంది. అలాగే ... చేతినిండా పని ఉండి అలసిపోయినా ఫర్లేదు. కానీ... పనేం లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే చాలా ఇబ్బందే. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లోనే ఉన్నా అంది.
త్వరలో ఆమె రవితేజ సరసన 'సారొస్తారా'లో నటించబోతోంది. రవితేజ హీరోగా రూపొందుతున్న'సారొస్తారా' చిత్రంలో త్రిష, అమల పాల్ హీరోయిన్లగా చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా....అమల పాల్ సెకండ్ లీడ్ గా ఎంపికయినట్లు సమాచారం. గతంలో(2008) రవితేజ, త్రిష జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో 'కృష్ణ' చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఈ ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. తాజాగా అదే రేంజ్‌లో 'సారొస్తారా' చిత్రంలో రవితేజ, త్రిష అలరించనున్నారట.
'సారొస్తారా' చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రవితేజ-పరశురాం కాంబినేషన్లో 'ఆంజనేయులు' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఇక ఒకప్పుడు నెంబర్ వన్ స్థానంలో వెలిగి పోయిన త్రిష...ఆ తర్వాత వరుస ప్లాపులు, అవకాశాలు తగ్గడంతో చాలా వెనక బడి పోయింది. మళ్లీ పుంజుకుని మెల్లిమెల్లిగా తన కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటున్న ఆమె ఇటీవల ఎన్టీఆర్‌తో దమ్ము, తాజాగా రవితేజతో 'సారొస్తారా'లో చాన్స్ సంపాదించి మిగతా హీరోయిన్స్ కి షాక్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











