పబ్ కెళ్తే తప్పు చేసినట్లేనా? త్రిష మండిపాటు
"త్రిషని చూడండి ఎప్పుడూ పబ్‌లంటూ తిరుగుతుంది...అని నేనేదో తప్పు చేసినట్టు పబ్లిసిటీ చేస్తుంటారు. ఏం పబ్ లకు వెళ్ళటం తప్పా? మోడ్రన్ రోజుల్లో బ్రతుకుతున్నా ఇంకా క్రీస్తు పూర్వం రోజుల్లోనే మేము ఉండాలంటే ఎలా? అని ప్రశ్నిస్తోంది త్రిష. ఆమెను మీడియా వారు ఏంటి న్యూ ఇయిర్ ని ఏ పబ్ లో ఎంజాయ్ చేసారు అని ప్రశ్నిస్తే ఇలా చిర్రుబుర్రులాడిపోయింది. అయినా నేను పార్టీలకు, పబ్‌లకు వెళ్ళినా నాకు బాగా దగ్గరవాళ్ళ తోనే వెళ్తాను. నా అందం, ఆరోగ్యం పట్ల నాక్కూడా శ్రద్ధ ఉంటుంది. అందువల్ల మీరేమీ బెంగపెట్టుకోవద్దు...నేనేమీ పబ్ లకు వెళ్ళి ఎక్కువ నిద్రలేని రాత్రుల్ని గడపటం లేదు. అప్పుడప్పుడూ ప్రెండ్స్ తో సరదాగా వెళ్తే తప్పులేదన్నది నా ఆలోచన." అంది. ప్రస్తుతం ఆమె వెంకటేష్ తో చేసిన 'నమో వెంకటేశా' రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే తమిళంలో శింబుతో చేసిన 'విన్నైతాండి వరువాయా' విడుదలకు సిద్ధమవుతోంది. హిందీలో అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో చేస్తున్న 'కట్టామీటా' నిర్మాణంలో ఉంది.


Click it and Unblock the Notifications











