డ్రగ్స్ తీసుకుంటున్నానని ఒక్క ప్రూఫ్ చూపెట్టండి: త్రిష
డ్రగ్ తీసుకుంటోందంటూ త్రిషను టీవీ ఛానెల్స్ లో చూపటంపై మండిపడుతోంది. తనను చూపిన టీవీ ఛానెల్స్ పైనా,తన పేరు వెల్లడి చేసిన పోలీసులుపైనా కేసు వేస్తానని అంది. అలాగే ఆధారాలు లేకుండా పోలీసులు ఎలా ఆ ఛానెల్ కు చెప్పుతారని ఆమె ప్రశ్నిస్తోంది. కేసు పెట్టే విషయమై తన లాయిర్ ని సంప్రదించానని ఆమె మీడియాకు తెలియచేసారు. అలాగే తను డ్రగ్స్ తీసుకుంటున్నానని ఒక్క ప్రూఫ్ అయినా చూపగలరా అని పోలీసులకు సవాల్ విసురుతోంది. ప్రస్తుతం త్రిష..కమల్ హాసన్ తో కలిసి మన్మధన్ అంబు అనే చిత్రంలో చేస్తోంది.
ఇక డ్రగ్స్ తో హీరో రవి తేజ సోదరులతో పాటు పట్టుబడిన ఉగండా జాతీయుడు క్లెమెంట్ వద్ద ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా త్రిషకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ శనివారం వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. నిందితుడు క్లమెంట్ వద్ద ఉన్న క్లయింట్లకు చెందిన 17 మంది ఫోన్ నెంబర్లను పోలీసులు విడుదల చేశారు. క్లెమెంట్ వద్ద ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల కుమారుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. త్రిష, రాజా, సైరాబానుకు చెందిన ఫోన్ నెంబర్లు అందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











