సీనియర్ హీరో కోసం ఐటమ్ గర్ల్ గా మారుతున్న త్రిష... మాస్ సాంగ్ తో ఊపేయడం పక్కా
సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె లైనప్ లో విశ్వంభర, థగ్ లైఫ్ వంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అయితే ఈ చెన్నై చిన్నది ఓ సీనియర్ హీరో కోసం ఐటమ్ సాంగ్ చేయబోతుందని టాక్ నడుస్తోంది. మరి త్రిష ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోంది అనే విషయంపై లుక్కేద్దాం.
తాజాగా త్రిష తను డ్యాన్స్ రిహార్సల్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో నాలుగు రోజులుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కష్టపడినట్టు వెల్లడించింది.

దానికి త్రిష మనీ సర్ అండ్ ఏఆర్ఆర్ అని క్యాప్షన్ ఇచ్చింది. అలాగే థగ్ లైఫ్ అనే హాష్ ట్యాగ్ కూడా ఉంది. దీంతో ఈ ఫోటోలు చూశాక కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. త్రిష థగ్ లైఫ్ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం ఇప్పటికే తెలిసింది.
తాజాగా ఆమె పాపులర్ కొరియోగ్రాఫర్ బృందాతో ఫోజులు ఇవ్వడం చూసి ఈ సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ చేయబోతుందని ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ రేంజ్ లో ప్రాక్టీస్ చేస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. దీంతో త్రిష త్వరగా రిహార్సల్స్ పూర్తి చేసి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. మొత్తానికి త్రిష ఈ సినిమాలో తన డాన్స్ తో అదరగొట్టబోతుందనే విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. అయితే అది స్పెషల్ సాంగా ? లేదంటే నార్మల్ రొమాంటిక్ పాటనా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

థగ్ లైఫ్ మూవీలో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా లెజెండరీ ఫిలిమ్ మేకర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటు త్రిష, శింబు, ఐశ్వర్య లక్ష్మి, భోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కమల్ హాసన్ ఈ మూవీలో హీరోగా నటించడమే కాకుండా తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ థగ్ లైఫ్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే థగ్ లైఫ్ మూవీ పై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న త్రిష స్పెషల్ సాంగ్ వార్తలు మూవీ లవర్స్ లో మరింత జోష్ పెంచేస్తున్నాయి. మరి మేకర్స్ ఈ వార్తలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











