ఇన్నాళ్ళూ త్రిషను హీరోయిన్ గానే చూసినవారు ఇకనుంచీ ఆమెలో దాగిఉన్న మరో కోణం అయిన గాయనిగా చూడాలంటున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు సింగర్ గా తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. అదీ అల్లాటప్పా మ్యూజిక్ డైరక్టర్ ట్యూన్ కి కాదుట. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలో పాడబోతోంది. ఆ సినిమా పేరు 'Chennayil Oru Mazhaikaalam" .ఘర్షణ ఫేమ్ గౌతమ్ మీనన్ ఈ చిత్ర దర్శకుడు. అంతే గాక త్రిష ఇప్పడు నాగ్ కింగ్ సినిమాలో సింగర్ గానూ పాత్రను పోషించటం యాదృచ్చికం.
Story first published: Friday, July 17, 2026, 22:24 [IST]