»   » త్రిషని సూపర్ స్టార్ కరుణిస్తాడా.. చాలా కష్టపడుతోంది!

త్రిషని సూపర్ స్టార్ కరుణిస్తాడా.. చాలా కష్టపడుతోంది!

Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రం కోసం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. రజనీకాంత్ నటించిన కాలా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోని చిత్రాన్ని కూడా రజనీకాంత్ ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రానికి సంబందించిన పనులని దర్శకుడు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రజని సరసన హీరోయిన్ గా నటించడానికి త్రిష ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అవకాశం కోసం త్రిష గట్టగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. త్రిష టాలీవుడ్, కోలీవుడ్ లో పేరుగాంచిన పెద్ద స్టార్స్ అందరొతో నటించింది. కానీ ఈ భామకు రజనీకాంత్ తో నటించే ఛాన్స్ మాత్రం ఇంత వరకు దక్కలేదు.

Trisha trying too hard to get a role in Rajinikanths film

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. విజయ్ సేతు పతికి, త్రిషకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అతడి ద్వారా ఈ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకోవాలని త్రిష ప్రయత్నాలు చేస్తోంది. తన కెరీర్ లో స్టార్ హీరోస్ అందరికి హీరోయిన్ గా నటించిన త్రిష రజినీకాంత్ సరసన కూడా నటించాలని ఉవ్విళ్లూరుతోంది.

English summary
Trisha trying too hard to get a role in Rajinikanth's film. Karthik Subbaraj is the director for this film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X