For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  త్రిష...కాబోయే భర్తతో విభేధాలా? ఇదా కారణం?

  By Srikanya
  |

  చెన్నై: సినిమావాళ్ల...ప్రేమలు..పెళ్ళిళ్లు ఎప్పుడో మలుపు తిరగుతాయో ఊహించటం కష్టం. త్రిష హఠాత్తుగా తాను ఓ బిజినెస్ మ్యాన్ (వరుణ్‌మణియన్)ని పెళ్లి చేసుకుంటానని ఎంగేజ్మెంట్ జరుపుకోవటం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిశ్చితార్దం భారీగా జరపటం, పార్టీలు కంటిన్యూగా తన వాళ్లకు ఇవ్వటం వంటివి చేసాక... అంతా పోన్లే ..ఈ ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్లిందని సంతోషపడ్డారు. కానీ అప్పుడే వీరి బంధం వీక్ అయ్యిందని, వివాహంతో ఒకటవక ముందే వద్దనుకున్నారని చెప్పుకుంటున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  నిశ్చితార్థం కార్యక్రమం కూడా జరుపుకుని నాలుగు నెలలు దాటినా వివాహ తేదీని నిర్ణయించుకోకపోవడంతో ఈ జంటపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీనికి రకరకాల కారణాలు వినపడుతున్నాయి. కొన్ని త్రిష వైపే తప్పు చూపెడుతున్నాయి. త్రిష ...మళ్లీ కెరీర్ లో బిజీ అవుతూండటంతో ఇలా వివాహాన్ని కాన్సిల్ చేసుకుందని చెప్పుకుంటున్నారు. అసలేం జరిగిందనే దానికి చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న కారణం ఇక్కడ మీరు చదువుతున్నది.

  Trisha and Varun parting ways?

  స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న త్రిష యువ సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్‌మణియన్ మధ్య ప్రేమ అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. అంతే ఆశ్చర్యంగా వివాహ నిశ్చితార్థం వరకు వెళ్లింది. ఆ వేడుక సందర్భంగా చిత్ర ప్రముఖులకు స్టార్ హోటల్‌లో బ్రహ్మాండమైన పార్టీని ఇచ్చారీ జంట. ఇక ఇరువర్గాల కుటుంబీకులు కలిసి పెళ్లికి మంచి ముహుర్తం నిర్ణయిస్తారని చెప్పారు. వరుణ్‌మణియన్, త్రిష వివాహ నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో జరిగింది. మార్చిలో వివాహం తంతు జరుగుతుందనే ప్రచారం జరిగింది.

  దీంతో త్రిష నటనకు స్వస్తి చెబుతారని, కాదు ఆమె వివాహానంతరం నటనను కొనసాగిస్తారంటూ పలు రకాల ప్రచారాలు దుమ్మురేపాయి. అయితే వీరి నిశ్చితార్థం జరిగి నాలుగు నెలలు అయ్యింది. ఇప్పటి వరకు పెళ్లి తేదీ ఖరారు కాలేదుకదా ఊసే లేదు. మనస్పర్థలా: ఇలాంటి పరిస్థితిలో త్రిష, వరుణ్ మణియన్‌ల గురించి చాలా వదంతులు ప్రచారంలో కొచ్చాయి. అందులో త్రిష, వరుణ్‌మణియన్‌ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయన్నది ఒకటి. వీరిద్దరు సోషల్ నెట్‌వర్క్సులో తరచూ తమ అభిప్రాయాలను పంచుకునేవారు.

  అలాంటిది గత నెల నుంచి ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం లేదట. మరో విషయం ఏమిటంటే నిశ్చితార్థంలో వరుణ్‌మణియన్ తొడిగిన ఉంగరం త్రిషే వేలికిప్పుడు కనిపించడం లేదట. మరో విషయం వరుణ్‌మనియన్ నిర్మించనున్న తాజా చిత్రంలో మొదట నటించడానికి అంగీకరించిన త్రిష ఆ తరువాత ఆ చిత్రం నుంచి వైదొలిగారనే ప్రచారం హోరెత్తింది. ఇలాంటి పరిస్థితిలో వరుణ్‌మణియన్, త్రిషల మధ్య అభిప్రాయబేధాలు పొడచూపిన విషయం నిజమేనని వారి సన్నిహిత వర్గాల సమాచారం.

  త్రిషకు వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థానికి ముందు పెద్దగా చిత్రాలు లేవు. అంతకుముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత త్రిష నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదలైన హిట్ అవ్వడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. మేనేజర్ గిరిధర్ నిర్మిస్తున్నారు. త్రిష చిత్రాలు మీద చిత్రాలు అంగీకరించడంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక కథనం రాసింది. అయితే ఈ వ్యవహారం గురించి ఇటు త్రిషగాని, అటు వరుణ్‌మణియన్‌గాని స్పందించక పోవడం గమనార్హం.

  English summary
  Trisha and Varun Manian got engaged in January Trisha now stopped wearing the engagement ring and also didnot attend important family function at Varun Manian's house. Differences are increasing between the two and Trisha's friends say there is incompatibility between both of them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X