త్రిష ఓకే,ఆనందంతో హీరో పార్టి
గత నాలుగేళ్ళుగా త్రిష ఆ యంగ్ హీరో విశాల్ కి మొండి చెయ్యి చూపెడుతోంది.అతనితో సినిమా చేయటానికి అంత సీన్ లేదన్నట్లుగా బిహేవ్ చేస్తోంది.అయితే ఇప్పుడామె పరిస్ధితి మారింది.వేషాలు ఎక్కడా దొరకని ఆమె ఎట్టకేలకు విశాల్ సినిమాను ఓకే చేసింది.దాంతో విశాల్ ఆనందానికి అంతేలేదు.విశాల్ నటించిన సత్యమ్, పిస్తా, కిలాడి చిత్రాల్లో త్రిషను హీరోయిన్ గా అడిగారు.అయితే ఆమె రిజెక్టు చేస్తూ వచ్చింది.ఇన్నాళ్ళకు ఆమ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అతనికి ఆనందం ఆగటం లేదు.తన వారందిరీ పెద్ద పార్టీ ఇచ్చాడు.
అయితే ఇది తెలుసుకున్న విశాల్ గత హీరోయిన్స్ ముఖం ముడుచుకున్నారు.అయితే ఇన్నాళ్లూ ఎందుకు త్రిష తిరస్కరించింది..హఠాత్తుగా ఎందుకు ఓకే చేసింది అంటే..దర్శకుడు తిరు చెప్పిన కథ నచ్చింది అంటోంది.ఆ కథ విని ధ్రిల్లయ్యానని అంటోంది.అయితే త్రిషకు అంత సీన్ లేదు.చేతిలో తెలుగులో బాడీగార్డు,తమిళంలో మంగత్తా తప్ప ఏమీ లేకపోవటంతో ఆమె వేరే దారిలేక ఇలా విశాల్ కి ఓకే అంది.అయితే ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. దీపావళి తర్వాత ఈ చిత్రాన్ని ఆరంభించి, నాలుగే నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారట. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయలేదు.


Click it and Unblock the Notifications











