త్రిష ని వదిలి పెట్టని డైరక్టర్ గౌతం మీనన్
సూపర్ హిట్టయిన ఏ మాయ చేసావె చిత్రం హిందీలోకి రీమేక్ కి త్రిషనే కన్ఫర్మ్ చేసారు. ఆమె మరోసారి జెస్సీ పాత్రలో కనిపించనుంది. అంబికా హిందూజా గ్రూప్ వారు ఈ చిత్రాన్ని రీమేక్ రైట్స్ తీసుకుని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పాలుపంచుకోనున్నారు. వారు రీసెంట్ గా తీన్ పత్తి చిత్రాన్ని నిర్మించారు. ఇంతకుముందు గౌతం మీనన్ చెలి చిత్రాన్ని రెహనా హై తేరా దిల్ మే పేరుటో రీమేక్ చేసారు. కానీ సక్సెస్ కాలేదు. దానికి కారణం ఆ చిత్ర నిర్మాతల ప్రవర్తనే అని అప్పట్లో గౌతం మీనన్ కామెంట్ చేసారు. అందుకే గౌతం ఈ సారి ఈ చిత్రాన్ని తన నిర్మాణంలో కార్పరేట్ భాగస్వామ్యం తీసుకుని దర్శకత్వం చేయాలని యోచిస్తున్నారు. ఈ చిత్రం రైట్స్ కోసం వసు భగ్నాని, రాకేష్ రోషన్ ట్రై చేసారు. ప్రస్తుతం త్రిష దృష్టంతా హిందీలో సెటిల్ అవ్వటం మీదే ఉంది. ఆమె తన గురువు ప్రియదర్శన్ రూపొందిస్తున్న కట్టా మీటా చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











