ఆమె ఒక ఐటమ్.. పెళ్లి చేసుకుని ఏం చేస్తావ్.. హీరోయిన్‌పై ఘాటుగా, ఎలా నోరు మూయించిందంటే!
అదృష్టం అంటే తమిళ బిగ్ బాస్ భామ ఓవియదే అని చెప్పొచ్చు. తొలి చిత్రం కలవానితో మంచి సక్సెస్ అందుకున్న ఓవియాకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ నిరాశపరచడంతో కెరీర్ పూర్తిగా పడిపోయింది. ఆ సమయంలో బిగ్ బాస్ 1లో అవకాశం దక్కించుకుంది. తమిళ బిగ్ బాస్ తో ఓవియాకు మంచి క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే సోషల్ మీడియాలో ప్రతి రోజు ఓవియా తలచుకునే అభిమానులు ఉన్నారు. ఇప్పుడు సినిమామా అవకాశాలు అందుకుంటోంది. తనపై దురుసుగా కామెంట్స్ చేసిన ఓ నెటిజన్ కు ఓవియా ఇచ్చిన సమాధానం అదిరిపోయేలా ఉంది.

వరుస అవకాశాలు
బిగ్ బాస్ తమిళ సీజన్ 1లో పాల్గొన్న తర్వాత ఓవియాకు సినిమా అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఈ ఏడాది ఓవియా నటించిన పలు చిత్రాలు విడుదలయ్యాయి. ఓవియా ప్రధాన పాత్రలో నటించిన 90 ఎంఎల్ చిత్రం వివాదాలు సృష్టించిన సంగతి తెలిసిందే. అందులో ఉన్న బోల్డ్ కంటెంట్, అభ్యంతరకర సన్నివేశాలపై పలువురు విమర్శలు చేశారు. ఇక ఇటీవల విడుదలైన కాంచన 3లో ఓవియా రాఘవ లారెన్స్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.

28వ పుట్టిన రోజు
సోమవారం రోజు ఓవియా తన 28వ బర్త్ డేని స్నేహితులతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించేందుకు ట్విట్టర్ లో ఆస్క్ ఓవియా హ్యాష్ ట్యాగ్ తో చిన్న సెషన్ నిర్వహించింది. ఇందులో చాలా మంది నెటిజన్లు వేసిన ప్రశ్నలకు ఓవియా సంతోషంగా సమాధానం ఇచ్చింది. కానీ ఓ నెటిజన్ మాత్రం తీవ్ర ఆగ్రహం తెప్పించేలా ప్రవర్తించాడు. అసభ్యంగా కామెంట్ చేశాడు.

ఆమె ఒక ఐటమ్
ఓ నెటిజన్ ఒవియాని.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని సరదాగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నపై మరో నెటిజన్ స్పందిస్తూ.. ఆమె ఒక ఐటమ్.. పెళ్లి చేసుకుని ఎం చేస్తావ్ అంటూ ఓవియాని కించపరిచేలా మాట్లాడాడు. దీనితో ఓవియా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చి అతడి నోరు మూయించింది. మీ అమ్మ కూడా ఐటమే అంటూ ఓవియా సమాధానం ఇచ్చింది. ఓవియాకు నెటిజన్ల నుంచి మద్దత్తు లభించింది.

రిలేషన్ షిప్
ఇదిలా ఉండగా ఓవియా ప్రస్తుతం నటుడు అరవ్ తో రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరూ తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్నారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఓవియా తాను అరవ్ తో ప్రేమలో ఉన్న విషయాన్ని బహిరంగంగానే ప్రకటించింది. ప్రస్తుతం ఓవియా కలవాని 2లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











