తల్లి వయసులో ఐటెం పాటలా? నటి కస్తూరికి చేదు అనుభవం!
తమిళ నటి కస్తూరికి తాజాగా సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. గత ఎనిమిదేళ్లుగా సపోర్టింగ్ రోల్స్, అతిథి పాత్రలో కాలం వెల్లడిస్తున్న కస్తూరి తాజాగా తమిజ్ పదం అనే చిత్ర సీక్వెల్‌లో ప్రత్యేక పాటలో నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఐటమ్ పాటలో నటించారు. దానిపై ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు.
కస్తూరి చేసిన ఐటెం సాంగ్‌పై ట్విట్టర్‌లో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇప్పుడు ఐటెం సాంగ్ చేయడం సరైనదేనా? బాధ్యతాయుతమైన ఓ తల్లిగా అలాంటి డ్యాన్స్ చేస్తారా? అని ప్రశ్నించారు.

తనపై కామెంట్ చేసిన నెటిజన్‌కు ఘాటుగా స్పందిస్తూ.. మీది టిపికల్ మైండ్ నీది. తల్లిగా, సెక్సీగా, పవిత్రంగా కనిపించడమనేది మైండ్‌కు సంబంధించినది. పిల్లలు ఉన్న ముసలి నటులు సెక్సీ పాటలు, రొమాన్స్ సీన్లలో నటిస్తే మాట్లాడరెందుకు అని నిలదీశారు.


Click it and Unblock the Notifications











