రజనీకాంత్ అనారోగ్యానికి అస్సలు కారణం అదేనంటున్నారు
ఉదయం 'రాణా' ప్రారంభోత్సవంలో పాల్గొన్న రజనీకాంత్ మధ్యాహ్నం 1.30 గం.లకు అస్వస్థతకు గురి అయిన సంగతి తెలిసిందే. కడుపునొప్పితో బాధపడుతూ చెన్నై మైలాపూర్‌లోని ఇసబెల్లా ఆస్పత్రిలో చేరారు. అజీర్తి సమస్యవల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని రజనీకాంత్ భార్య లత, వైద్యుడు కిషోర్‌లు తెలియజేసారు.సాయంత్రం ఆరుగంటలకు ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.అయితే రజనీకాంత్ అనారోగ్యానికి కారణం అజీర్తి కాదని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
ఇదే విషయాన్ని ఓ లీడింగ్ ఇంగ్లీష్ పేపర్ కూడా కన్ఫర్మ్ చేసింది.వారు చెప్పేదాని ప్రకారం రజనీకాంత్ కి ఉన్న త్రాగుడు అలవాటు ఒకేసారి మానేయటం ఈ సమస్య వచ్చిందని చెప్తున్నారు.ఆయన మొన్న డిసెంబర్ లో ఆయన పుట్టిన రోజున గత నలభై ఏళ్ళుగా ఉన్న అలవాటుకి స్వస్తి చెప్పారు.అయితే ఒకేసారి మందు మానేయవద్దని డాక్టర్స్ సూచించినా ఆయన మొండిగా పట్టుదలతో కంట్రోలులో ఉంటున్నారని అదే ఈ ఆరోగ్య సమస్యకు కారణంటున్నారు.


Click it and Unblock the Notifications











