Thug Life: కమల్ హాసన్ మొండి.. కన్నడవాసుల జగమొండి.. థగ్ లైఫ్‌కు ఎన్ని కోట్ల నష్టమంటే?
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం మరోరకంగా చిచ్చు పెట్టింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కన్నడవాసుల భగ్గుమన్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ చేసిన కామెంట్స్ తప్పు పడుతూ ఆయన వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో ప్రదర్శించకుండా చర్యలు తీసుకొంటామని, రిలీజ్‌పై వారు నిషేధం ప్రకటించారు. అయితే కన్నడవాసులను ఆగ్రహానికి గురిచేసిన కమల్ వ్యాఖ్యలు ఏమిటి? థగ్ లైఫ్ సినిమాను రిలీజ్ చేయకుండా నిషేధిస్తే ఎంత నష్టం వాటిల్లుతుంది? అనే వివరాల్లోకి వెళితే..
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, త్రిషా, అభిరామి, శింబు నటించిన థగ్ లైఫ్ సినిమా థగ్ లైఫ్ చిత్రం ఆడియో వేడుక చెన్నైలో జరిగింది. ఘనంగా జరిగిన ఈవెంట్‌లో శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ ముందే కమల్ హాసన్ మాట్లాడుతూ.. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టింది అని అన్నారు. దాంతో కన్నడ వాసుల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ వివాదంపై కన్నడ బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

నేను కన్నడ వాసులను అవమానించే ఉద్దేశంతో మాట్లాడలేదు. నేను ఏదైతే మాట్లాడానో.. అది ప్రేమతో కూడిన మాటలే. చరిత్రలో భాష గురించి చరిత్రకారులు చెప్పిన విషయాలను మాత్రమే అన్నాను. అందులో నాకు దురుద్దేశం లేదు. తమిళనాడు రేర్ స్టేట్. మీనన్ పేరుతో ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి, రెడ్డి కులస్తుడు మంత్రిగా, కన్నడ వాసులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కన్నడ నుంచి జయలలిత చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇది నా సమాధానం కాదు. ఇది వివరణ మాత్రమే. ప్రేమను కోరుకొనే వారు క్షమాపణలు అడగరు అని కమల్ హాసన్ అన్నారు.
అయితే తాను చేయని తప్పుకు క్షమాపణ చెప్పమని అడగడం సరికాదు. నేను తప్పు చేయనప్పుడు సారీ చెప్పను. తప్పు చేస్తే నేను సారీ చెప్పగలను. ఏది ఏమైనా నేను ఈ విషయంలో సారీ చెప్పను. సినిమా కోసం చేయని తప్పు ఒప్పుకోను. ఈ విషయంలో కన్నడవాసులు ఏం చేసినా తనకు అభ్యంతరం లేదు. సినిమాపై వారు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా పర్వాలేదు అని కమల్ ఇటీవల ఈ విషయంపై మొండిగానే ఉన్నారు.
ఇక రాష్ట్రంలో కమల్, కన్నడవాసుల మధ్య రగులుతున్న వివాదంపై శివరాజ్ కుమార్ స్పందించారు. ఈ వేడుకలో పాల్గొన్నది నిజమే. కమల్ మాట్లాడిన సమయంలో నేను అక్కడే ఉన్నాను. ఆ విషయంలో నేను కన్నడ వాసుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొంటాను. నాకు స్నేహం, సినిమా కంటే కన్నడ భాష, కన్నడ భూమికే నా ప్రాధాన్యత ఉంటుంది. కన్నడ విషయంలో ఎలాంటి రాజీపడను అని శివరాజ్ కుమార్ తన వైఖరిని వెల్లడించారు.
అయితే కన్నడవాసులు జగమొండిగా వ్యవహరించడంపై కమల్ స్పందించి తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కన్నడవాసుల ఆందోళనకు కొంత సానుకూలత ఉండగా.. కమల్ నిర్భయంగా వాస్తవాలు మాట్లాడారు అంటూ తమిళ అనుకూల వర్గం కామెంట్ చేసింది. అతను సారీ చెప్పడు. ఈ విషయంలో ఆయన వెనుకంజ వేయడు. ఒకవేళ థగ్ లైఫ్ మీద బ్యాన్ ప్రకటిస్తే.. సుమారుగా 40 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్తుతుందే ఏమో కానీ.. ఆయన తన మాటలకు కట్టుబడి ఉండటం అతడి కమిట్‌మెంట్‌ను తెలియజేస్తుంది అని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ ట్రేడ్ అనలిస్ట్ వెల్లడించారు.
అయితే కమల్ తనకు ఆర్థికంగా నష్టం వాటిల్లినా.. సినిమా కోసం రాజీ పడకపోవడం అందర్నీ ఆకట్టుకొంటున్నది. తమిళ ఆస్థిత్వం, ప్రతిష్టను, వాస్తవాలను ఆయన పణంగా పెట్టకపోవడంపై తమిళ వర్గాలు ప్రశంసలు గుప్పిస్తున్నాయి. తమిళుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న ఆయన సినిమాను అందరూ థియేటర్‌కు వెళ్లి చూడాలి. కమల్ హాసన్‌కు అండగా నిలువాలనే నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











