నెగిటివ్ పాత్రలో 'కడలి' హీరోయిన్
చెన్నై : మణిరత్నం 'కడలి' చిత్రంతో పరిచయమైన తులసి గుర్తుందా....ఆమె తన రెండో చిత్రంలోనే సవాలైన పాత్ర పోషించనుంది. ఈ పాత్ర పూర్తి నెగిటవ్ గా నడుస్తుందని, తన ఉనికిని పూర్తి స్ధాయిలో తమిళ పరిశ్రమలో చాటుతుందని భావిస్తోంది. ఆ చిత్రం పేరు 'యాన్'.
రాధ పెద్ద కుమార్తె కార్తిక హీరోయిన్ గా రాణిస్తున్న నేపథ్యంలో చిన్న కుమార్తె తులసి కూడా వెండితెరపై కాలుమోపింది. మణిరత్నం దర్శకత్వంలో కార్తీక్ నట వారసుడు గౌతమ్ కార్తీక్ తెరంగేట్రం చేసిన చిత్రం ద్వారా పరిచయం కావటం ఆమెకు ఎక్కడలేని ప్రచారాన్ని తెచ్చిపెట్టింది.
అయితే ఆ సినిమా అంచనాలు అందుకోలేక చతికిలపడటంతో, చేదు జ్ఞాపకాలను తుడిచిపెట్టి ప్రస్తుతం జీవాకు జంటగా 'యాన్'లో నటిస్తోంది. ఇందులో తులసి పాత్ర ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుందని చెన్నై వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమె విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. అత్యంత కీలకమైన పాత్రని, ప్రశంసనీయ నటన కనబరుస్తోందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications












