అందుకే త్రిషతో రమ్యకృష్ణ గొడవ
త్రిష, రమ్యకృష్ణ మంచి స్నేహితురాళ్ళలనే సంగతి తెలిసిందే. తాజాగా వీళ్ళిద్దరూ విడిపోయారనే వార్త అంతటా వినపడుతోంది. దానికి కారణం రమ్యకృష్ణ భర్త కృష్ణవంశి చిత్రం మహాత్మ అని చెప్తున్నారు. శ్రీకాంత్ హీరోగా చేస్తున్న ఆ చిత్రంలో హీరోయిన్ గా త్రిషను పెట్టుకోవాలని కృష్ణవంశి ప్లాన్ చేసారు. అయితే త్రిష ఆ పాత్ర నచ్చలేదంటూ తిరస్కరించింది. అయితే పెద్ద స్టార్స్ సరసన చేస్తున్న తాను శ్రీకాంత్ తో చెయ్యటం ఇష్టం లేకనే అలా చెప్పిందిట. అయితే రమ్యకృష్ణ ఈ విషయంలో కలగచేసుకుని త్రిషను ఆ పాత్ర చేయమని పట్టుపట్టిందని చెప్పుతున్నారు. కెరీర్ విషయంలో ప్రతీసారి రమ్య సలహాలు తీసుకునే త్రిషకు ఈ డిమాండ్ నచ్చలేదు. అయితే తను కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు శ్రీకాంత్ సరసన చేయటానికి ఏ మాత్రం సంకోచించలేదని చెప్పబోతే టాపిక్ మార్చింది త్రిష. దాంతో కాలిన రమ్యకృష్ణ ఆ ప్రెండ్ షిప్ కు ఫులి స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుందుట. త్రిష కూడా తన కెరీర్ కి సంభందించిన ఇష్యూ ఇదని ఎంత స్నేహితురాలైనా అలా అడగటం న్యాయం కాదని చెప్తోంది. ఇక వీళ్ళిద్దరూ తరుచూ పార్టీలు,పబ్ లకు కలిసే వెళ్ళటం చూసిన వారు మాత్రం అరె...విడిపోతున్నారా అంటున్నారు.


Click it and Unblock the Notifications











