ప్రియుడిపై నటి వేధింపుల కేసు.. నిప్పంటించుకొని సూసైడ్.. సంచలనం రేపిన ఘటన
Recommended Video

వివాదాస్పద తమిళ నటి నీలాణి మరోసారి వార్తల్లో నిలిచింది. పెళ్లి చేసుకొమని బలవంతం చేసున్నాడనే ఆరోపణలతో తన ప్రియుడిపై నీలాణి చెన్నైలోని మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ప్రియుడు ఒంటికి నిప్పంటించుకొని సూసైడ్‌కు ప్రయత్నించడం సంచలనంగా మారింది. వివారాల్లోకి వెళితే..

బుల్లితెరపై నీలాణి
తమిళ చిత్ర పరిశ్రమలోను, బుల్లితెరపైన నీలాణి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నది. తమిళనాడులో సంచలనం రేపిన స్టెర్లైట్ పోరాట దృశ్యాలను పోలీసుల దుస్తుల్లో వెళ్లి చిత్రీకరించి మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఈ వ్యవహారంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవలే బెయిల్‌పై విడుదల అయ్యారు.

లలిత్‌తో మూడేళ్లుగా అఫైర్
కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ టెలివిజన్ సీరియల్స్‌లో బిజీగా మారింది. నీలాణికి కొద్దిరోజులుగా స్థానికుడైన గాంధీ లలిత్ కుమార్ అనే యువకుడితో గత మూడేళ్లుగా అఫైర్ నడుస్తున్నట్టు తెలిసింది. అయితే వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో కొంత దూరంగా ఉంటున్నారు.

పెళ్లి చేసుకొమని గొడవ
నీలాణి ఆదివారం స్థానిక మైలాపూర్‌లో జరుగుతున్న ఒక టీవీ.సీరీయల్ షూటింగ్‌లో పాల్గొంది. అక్కడికి వచ్చిన గాంధీలలిత్‌కుమార్ వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని గొడవకు దిగాడు. దాంతో టీవీ సీరియల్ షూటింగ్‌లో కలకలం చెలరేగింది. దీంతో నటి నీలాణి స్థానిక మైలాపూర్ పోలీసులకు ప్రియుడు గాంధీలలిత్‌కుమార్‌పై ఫిర్యాదు చేసింది.

ప్రియుడిపై నీలాణి కేసు
గాంధీలలిత్‌కుమార్‌తో మూడేళ్లుగా స్నేహంగా ఉంటున్నాను. అయితే తాను క్లోజ్‌గా ఉండటంతో పెళ్లి చేసుకోవాలని గొడవ చేస్తున్నాడు. అది తనకు ఇష్టం లేదు. షూటింగ్ స్పాట్‌కు వచ్చి గొడవ చేస్తూ వేధిస్తున్నాడు. కాబట్టి గాంధీలలిత్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో నటి నీలాణి కోరింది. ఆమె ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నీలాణి కేసు వాపసు
పోలీస్ స్టేషన్‌లో నీలాణి, గాంధీ లలిత్ కుమార్ మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వారు మధ్యవర్తిత్వం జరిపి కేసు వాపసు తీసుకొన్నారు. ఈ వివాదాన్ని బయట పరిష్కరించుకొందామని చెప్పడంతో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
నీలాణి ప్రవర్తన, నమోదు చేసిన కేసుతో మనస్తాపం చెందిన గాంధీ లలిత్ కుమార్ సూసైడ్‌కు ప్రయత్నించారు. తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించి 108 అంబులెన్స్ కాల్ చేసి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం కిల్‌పౌక్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

గాంధీ లలిత్ కుమార్‌పై కేసు
ప్రస్తుతం కేకే నగర్ పోలీసులు గాంధీ లలిత్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో నీలాణిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం గాంధీ పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











