తెలుగు టీవీ ఆర్టిస్టు అనుమానస్పద మృతి

ఇక ఈ ఘటన జరిగిన క్రమం ఇలా ఉంది...చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ఇంజంబాక్కం హరిచంద్ర కాలనీలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఈ నెల ఆరో తేదీన షా(26) అనే వ్యక్తి కుమార్ పేరుతో ఓ గది తీసుకున్నాడు. అనంతరం శశిరేఖతో కలిసి వచ్చాడు. సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో బయటికెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి భోజనం ఇచ్చేందుకు గెస్ట్ హౌస్ సిబ్బంది గది వద్దకు వెళ్లి ఎంత పిలిచినా ఎవరూ పలకలేదు.
గది తలుపులు పగులగొట్టి చూడగా శశిరేఖ ఫ్యానుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. షా..సినిమాలకు గ్రూప్ డ్యానర్లను సప్లయ్ చేసేవాడని తెలిసింది. కొంత కాలంగా శశిరేఖ షాతో సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. శశిరేఖ మృతి చెందిన గదిలో ఆరు ఖాళీ బీరు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శశిరేఖ గది పక్కనే ఉన్న మరో గదిలో ఆరుగురు యువకులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆమె మృతి వార్త బయటకు పొక్కగానే వారు, హడావుడిగా గది ఖాళీ చేసి వెళ్లినట్లు తెలిసింది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షా ఇంట్లో తనిఖీలు నిర్వహించగా వంద కండోమ్ లు, మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. పరారీలో వున్న షా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











