Divorce: విజయ్‌పై మెంటల్ క్రుయాలిటీ ఆరోపణలు? భారీగా భరణం డిమాండ్.. సంగీత వెనుక ఉన్నది ఎవరు?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళపతి విజయ్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆయన సతీమణి సంగీత సోర్నలింగమ్ తనకు విడాకులు విప్పించాలంటూ చెన్నైకి సమీపంలోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉంది. ఆ కారణంగా నేను మానసిక క్షోభను అనుభవిస్తున్నాను. విజయ్‌తో దాంపత్య జీవితాన్ని కొనసాగించడం కష్టంగా ఉంది. కాబట్టి ఆయనతో విడాకులు ఇప్పించాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్‌లో కోర్టును సంగీత అభ్యర్థించింది.

అయితే విజయ్ జీవితానికి కీలక ఘట్టంగా మారిన తమిళనాడు ఎన్నికలకు ముందు భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసి తీవ్రమైన ఆరోపణలు చేయడంపై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కోర్టులో పిటిషన్ వేయడం వెనుక రాజకీయ ప్రభావం ఉందా? అనే ఊహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి. సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో ఆమె పెట్టిన డిమాండ్ల వివరాల్లోకి వెళితే..

TVK Cheif Vijay Wife Sangeetha Divorce

1999 సంవత్సరంలో విజయ్, సంగీత ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. దాదాపు 27 ఏళ్లపాటు వారి దాంపత్య జీవితం సక్రమంగా కొనసాగింది. అయితే 2021 సంవత్సరం నుంచి వైవాహిక జీవితంలో కలతలు చోటు చేసుకొన్నాయి. పరస్పరం విభేదాలు బయటపడ్డాయి. స్టార్ హీరోయిన్‌తో ఉన్న వివాహేతర సంబంధం వారి కాపురంలో చిచ్చు పెట్టింది. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. విజయ్ వివాహేతర సంబంధం కారణంగా వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగింది. ఆర్థికపరమైన అభద్రతకు లోనువుతున్నాను అని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పిటిషన్ దాఖలు చేసింది.

విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలంటూ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 27 (1) (a)సెక్షన్ 27 (1) (b), సెక్షన్ 27 (1) (d) కింద తన పిటిషన్ దాఖలు చేసింది. వివాహేతర సంబంధం, తనకు దూరంగా ఉంటున్నారని, మెంటల్ క్రూయాలిటీ అనే కారణాలను వెల్లడిస్తూ డైవోర్స్ పిటిషన్ దాఖలు చేయడం భారీ చర్చకు దారి తీయడమే కాకుండా తమిళ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది.

అలాగే తన విడాకులు మంజూరు చేస్తూనే తన జీవితం సాఫీగా సాగడానికి నెలవారీ మెయింటెనెన్స్, అలాగే శాశ్వత భరణాన్ని ఇప్పించాలని కోర్టుకు తన డిమాండ్లను వెల్లడించింది. అయితే తన రోజువారీ జీవితం గడవడానికి, విడాకుల కింద భరణం కోసం భారీ మొత్తాన్ని ఆశించే అవకాశం ఉందని తమిళ సినీ, రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే విజయ్, సంగీత దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు, కుమార్తె ఉన్నారు. వారి బాధ్యత వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇక ఇదిలా ఉంటే.. విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఎదో ఒక సమస్య ఆయనను వెంటాడుతున్నది. కరూర్ తొక్కిసలాట నుంచి, సీబీఐ విచారణ, జననాయగన్ విడుదల నిలిపివేత, రాజకీయపరమైన ఆంక్షలు తదితర అంశాలు ఆయనను చుట్టుముట్టాయి. ఇలా ఊపిరి సలపకుండా సమస్యల్లో ఉన్న విజయ్‌ను భార్య విడాకుల నోటీసు ఇవ్వడం మరో దెబ్బ పడినట్లయింది. అయితే ఆమె వెనుక ఎవరు ఉన్నారు? ఈ కథంతా ఎవరు నడిపిస్తున్నారనే చర్చ తమిళ సినీ, రాజకీయాల్లో జరుగుతున్నది.

More from Filmibeat

Read more about: vijay sangeetha kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X