TVK Vijay's NetWorth: దళపతి విజయ్ ఆస్తులు ఎన్ని? అప్పులు ఎన్ని? అఫిడవిట్ వివరాలు..

తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు ఇప్పటికే పొత్తులు ఖరారు చేసి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా... ఇప్పుడు అందరి దృష్టి తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు తలపతి విజయ్ ( Vijay)పై పడింది. సినీ రంగంలో స్టార్ హీరోగా దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగిన ఆయన, ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టడంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.

మరి ముఖ్యంగా కూటమి రాజకీయాలకు దూరంగా ఉండి, స్వతంత్రంగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఎన్నికల బరిలో దిగిన విజయ్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో వెల్లడించారు. దీంతో దళపతి విజయ్ ఆస్తులు ఎన్ని? అప్పులు ఎన్ని? అఫిడవిట్ వివరాలేంటీ? హాట్ టాపిక్ గా మారింది.

TVK Chief Thalapathy Vijay Affidavit

30 ఏళ్ల సినీ కెరీర్‌ను వదులుకుని, తమిళనాడు రాజకీయాల్లో వచ్చిన దళపతి విజయ్. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో తన అభ్యర్థులను బరి దించుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని 234 స్థానాలు, పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే అభ్యర్ధుల జాబితాను దళపతి విజయ్ ప్రకటించారు. తాను పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్లు విజయ్ దళపతి ప్రకటించారు. ఈ మేరకు తాజాగా నామినేషన్స్ దాఖాలు చేశారు.

ఈ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.600 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చరాస్తులు, స్థిరాస్తులు, పెట్టుబడులు, వాహనాలు, బ్యాంక్ డిపాజిట్లు వంటి అన్ని వివరాలను స్పష్టంగా వెల్లడించడం గమనార్హం. ముఖ్యంగా ఒక సినీ నటుడు రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఇంత పెద్ద స్థాయి ఆర్థిక వివరాలను బహిర్గతం చేయడం అరుదుగా కనిపించే విషయం కావడంతో, ఇది రాజకీయ వర్గాల్లోనే కాకుండా సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

విజయ్ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఆయన వద్ద సుమారు రూ.404 కోట్లకు పైగా చరాస్తులు ఉన్నాయి. ఇందులో బ్యాంక్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, కంపెనీల్లో పెట్టుబడులు, వాహనాలు, ఇతర ఆర్థిక ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకుల్లో భారీ మొత్తంలో డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే కుటుంబ సభ్యులకు ఇచ్చిన రుణాలు, అడ్వాన్సులు కూడా అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఇది ఆయన ఆర్థిక నిర్వహణ పద్ధతి ఎంత విస్తృతంగా ఉందో చూపిస్తోంది.

స్థిరాస్తుల విషయానికి వస్తే... విజయ్ వద్ద సుమారు రూ.115 కోట్ల నుంచి రూ.220 కోట్ల మధ్య విలువైన భూములు, ఇళ్లు, కమర్షియల్ భవనాలు ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని కీలక ప్రాంతాలు, కొడైకెనాల్‌లో వ్యవసాయ భూములు, నివాస గృహాలు, కమర్షియల్ ప్రాపర్టీలు అన్ని కలిపి ఆయన స్థిరాస్తుల విలువ భారీగా ఉంది. ముఖ్యంగా నీలాంకరై, మైలాపూర్, ఎగ్మోర్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఆయనకు ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇక విజయ్ భార్య సంగీత (Sangeetha) పేరిట ఉన్న ఆస్తులు కూడా ఈ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమె పేరిట బ్యాంకుల్లోనే సుమారు రూ.85 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో భారీ మొత్తంలో నిల్వలు ఉండటం విశేషం. అదనంగా ఆమె వద్ద బంగారం, వజ్రాలు, వెండి వంటి విలువైన ఆభరణాలు కూడా ఉన్నట్లు వివరించారు. మొత్తం మీద కుటుంబ స్థాయిలో ఆస్తుల విలువ రూ.530 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

విజయ్ వద్ద ఉన్న లగ్జరీ వాహనాల జాబితా కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. బీఎండబ్యూ 530 (BMW 530), బీఎండబ్యూ ఐ7 (BMW i7), టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి ఖరీదైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. వీటితో పాటు సాధారణ వాహనాలు కూడా ఉండటం గమనార్హం. ఇది ఆయన లైఫ్‌స్టైల్‌లో ఉన్న వైవిధ్యాన్ని సూచిస్తోంది.

ఆదాయ వివరాలకు వస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆదాయం రూ.184 కోట్లకు పైగా ఉండగా, గత సంవత్సరాల్లో కూడా వందల కోట్లలో ఆదాయం నమోదు చేశారు. ముఖ్యంగా సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్, ప్రాపర్టీల నుంచి వచ్చే అద్దె, బ్యాంక్ వడ్డీలు అన్ని కలిసి ఆయనకు భారీ ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. ఒక దశలో రూ.200 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్నట్లు పేర్కొన్నారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ అఫిడవిట్‌లో విజయ్ ఎలాంటి బాకీలు (లేదా) అప్పులు లేవని వెల్లడించారు. బ్యాంకులకు లేదా ఇతర ఆర్థిక సంస్థలకు ఎలాంటి పెండింగ్ డ్యూస్ లేవని స్పష్టం చేశారు. సినీ రంగంలో స్టార్‌గా ఉన్న ఆయన, ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ప్రభావం చూపగలడా? అన్న ప్రశ్నకు ఈ ఎన్నికలు సమాధానం ఇవ్వనున్నాయి. ప్రస్తుతం మాత్రం ఆయన ఆస్తుల ప్రకటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Read more about: thalapathy vijay tvk tamilnadu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X