Thalapathy Vijay: దళపతి విజయ్ కి భారీ షాక్.. విడాకులు కోరిన భార్య సంగీత!

Thalapathy Vijay: కోలీవుడ్ దళపతి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కు మరో భారీ షాక్ తగిలింది. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతూ విజయ్.. ఇటీవల రాజకీయ రంగప్రవేశం చేశారు. తమిళగ వెట్రి కళగం (TVK) అనే పార్టీని స్థాపించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇటీవల విజయ్ చివరి మూవీ'జననాయగన్' విడుదలకు పలు ఆటంకాలను ఎదుర్కొంటుంది. ఎలాగైనా ఆ సినిమాను విడుదల చేయాలని మూవీ మేకర్స్ తో పాటు ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో తన వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది.

హీరో విజయ్ భార్య సంగీత.. తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకాలని భావించింది. ఈ తరుణంలో సంగీత సొర్నలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ షాకింగ్ మారింది.

TVK Chief Thalapathy Vijay s Wife Sangeetha Files for Divorce at Chengalpattu Court

విజయ్-సంగీత 1999 ఆగస్టు 25న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. క్రైస్తవ మతానికి చెందిన విజయ్, హిందూ కుటుంబానికి చెందిన సంగీత సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుని, అనంతరం చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ జంటకు జేసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు సంతానం ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు వీరి వివాహ బంధం సాఫీగా కొనసాగింది.

అయితే, గత రెండు సంవత్సరాలుగా విజయ్-సంగీత మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. 2021 తర్వాత పరిస్థితులు మారాయని, ఓ ప్రముఖ నటితో విజయ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వదంతులు తమిళ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే సంగీత కోర్టును ఆశ్రయించారని టాక్.

సంగీత 12 పేజీల పిటిషన్‌ దాఖలు చేసినట్టు తెలుస్తోంది ఇందులో ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a), 27(1)(d) కింద విడాకులు కోరినట్లు సమాచారం. ఇవి ప్రధానంగా వివాహేతర సంబంధం, మానసిక,శారీరక క్రూరత్వానికి సంబంధించిన పలు నిబంధనలు, అలాగే.. తనపై ఆర్థిక ఆంక్షలు విధించారని, అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నానని సంగీత తన పిటిషన్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై విజయ్ లేదా ఆయన తరఫు నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

ఈ కేసు మార్చి 20న చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే..విచారణను 'ఇన్-కెమెరా' పద్ధతిలో నిర్వహించాలని సంగీత కోరినట్లు సమాచారం. ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరవుతారా? రాజీ చర్చలకు అవకాశం ఉంటుందా? అన్న అంశాలు ఆసక్తిగా మారాయి.

ఇటీవల రాజకీయ రంగంలో అడుగుపెట్టిన విజయ్, భారీ ప్రజాసభలతో తమిళ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్నారు. ఇలాంటి సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఈ పరిణామం రాజకీయంగా కూడా ప్రభావం చూపుతుందా ? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఊహాగానాలకు లోనుకాకూడదని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం ఎలాంటి నిర్ణయాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X