TVK Vijay: దళపతి విజయ్ కార్లన్నింటికీ 0277 నంబరే.. దాని వెనుక గుండెల్ని పిండేసే కథ

TVK Vijay: తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ దళపతి (Vijay)ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. 'తమిళగ వెట్రి కజగం' పార్టీతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్.. తమిళనాడు సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒకప్పుడు కేవలం సినిమాలతోనే బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన దళపతి.. ఇప్పుడు రాజకీయాల్లోనూ ప్రభావం చూపే వ్యక్తిగా నిలిచారు. విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సమయంలో ఆయన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ వినియోగించే ప్రతి వాహనంపై కనిపించే "0277" నంబర్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Also Read
'కల్కి 2'లో మరో బాలీవుడ్ నటుడు.. అసలు నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ ఏంటి?
'కల్కి 2'లో మరో బాలీవుడ్ నటుడు.. అసలు నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ ఏంటి?

విజయ్ ఇటీవల కొనుగోలు చేసిన విలాసవంతమైన కార్లను గమనిస్తే.. ప్రతి వాహనంపై ఒకే తరహా నంబర్ కనిపించడం విశేషం. ఆయన BMW i7 ఎలక్ట్రిక్ కారుకు TN 14 AH 0277, లెక్సస్ LMకు TN 14 AL 0277, టయోటా వెల్‌ఫైర్‌కు TN 14 AM 0277 నంబర్లు ఉండగా.. రాజకీయ ప్రచారానికి వినియోగిస్తున్న టీవీకే ప్రత్యేక బస్సుకు TN 14 AS 0277 నంబర్ ఉంది. అంతేకాదు, గతంలో ఆయన వినియోగించిన కొన్ని వాహనాల్లో కూడా ఇలాంటి ప్రత్యేక నంబర్లే కనిపించాయి. దీంతో "0277" వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.

Recommended For You
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ చీటింగ్ ... కోట్ల రూపాయాలు మోసపోయా!
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ చీటింగ్ ... కోట్ల రూపాయాలు మోసపోయా!
TVK Vijay s 0277 Car Number Secret Emotional Story Behind

సాధారణంగా సెలబ్రిటీలు తమ లక్కీ నంబర్లు లేదా జ్యోతిష్య నమ్మకాల ప్రకారం వాహన నంబర్లు ఎంచుకుంటారు. కానీ విజయ్ విషయంలో మాత్రం ఈ నంబర్ వెనుక ఒక గాఢమైన భావోద్వేగం దాగి ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. "0277" అనేది వాస్తవానికి 14-02-1977 తేదీకి సంకేతమని, అదే విజయ్ చెల్లెలు విద్యా చంద్రశేఖర్ జన్మదినమని అభిమానులు పేర్కొంటున్నారు. విజయ్ చిన్నతనంలోనే ఆయన చెల్లెలు విద్యా అనారోగ్య కారణాలతో రెండేళ్ల వయసులోనే మరణించింది. ఆ సంఘటన విజయ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆయన కుటుంబ సభ్యులు గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

You May Also Like
నా జీవితంతో ఆడుకున్నారు.. స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్..
నా జీవితంతో ఆడుకున్నారు.. స్టార్ యాంకర్ షాకింగ్ కామెంట్స్..

విజయ్ తండ్రి ఎస్ ఏ. చంద్రశేఖర్, తల్లి శోభ చంద్రశేఖర్ పలుమార్లు చెప్పినట్లుగా.. చెల్లెలు మరణానికి ముందు విజయ్ చాలా అల్లరి పిల్లాడిలా ఉండేవాడట. కానీ ఆ సంఘటన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడని వారు గుర్తుచేసుకున్నారు. ఆ బాధే విజయ్ వ్యక్తిత్వాన్ని మార్చిందని చెబుతారు. అందుకే తన జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా చెల్లెలి జ్ఞాపకాన్ని ఎప్పటికీ మరిచిపోకుండా ఉండేందుకు ప్రతి వాహనంపైనా "0277" నంబర్ ఉండేలా చూసుకుంటారట.

150 కోట్ల బిజినెస్ చేసిన తెలుగు పాట.. ఆ లిరిక్స్‌లో అంత పవర్ ఉందా?
150 కోట్ల బిజినెస్ చేసిన తెలుగు పాట.. ఆ లిరిక్స్‌లో అంత పవర్ ఉందా?

ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే.. విజయ్ తన కుమార్తెకు "దివ్య సాషా" అనే పేరు పెట్టడంలో కూడా తన చెల్లెలి జ్ఞాపకమే కారణమని చెబుతారు. "విద్యా" పేరును పోలి ఉండేలా ఆ పేరు ఎంపిక చేశారని గతంలో శోభా చంద్రశేఖర్ వెల్లడించారు. అలాగే ఆయన కుటుంబ నిర్మాణ సంస్థకు కూడా "విద్యా-విజయ్ ప్రొడక్షన్స్" అనే పేరు పెట్టడం వెనుక ఇదే భావోద్వేగం ఉందని అభిమానులు భావిస్తున్నారు. విజయ్ సినిమాల్లో తరచూ కనిపించే 'సిస్టర్ సెంటిమెంట్' కూడా ఆయన నిజజీవిత అనుభవాల ప్రభావమేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

విజయ్ దళపతిపై వేణుస్వామి జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..
విజయ్ దళపతిపై వేణుస్వామి జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..

ముఖ్యంగా 'తిరుపాచి' (తెలుగులో అన్నవరం), 'శివకాశి' వంటి సినిమాల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని విజయ్ పండించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఆ పాత్రల్లో ఆయన చూపించిన భావోద్వేగం వెనుక నిజ జీవిత బాధ ఉందని అభిమానులు భావిస్తుంటారు. అంతేకాదు, విజయ్ తన చెల్లెలి జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. విద్యార్థులకు సహాయం చేయడం, విద్యకు సంబంధించిన చారిటీ కార్యక్రమాలు నిర్వహించడం వంటి పనుల్లో ఆయన ఆసక్తి చూపుతుంటారని అభిమాన సంఘాలు చెబుతున్నాయి. అందుకే "0277" నంబర్ కేవలం ఒక వాహన నంబర్ మాత్రమే కాదు.. విజయ్ హృదయంలో ఎప్పటికీ చెరిగిపోని ఒక జ్ఞాపకానికి ప్రతీకగా మారింది.

HBD Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
HBD Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ఇప్పుడు తమిళ సీఎంగా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో.. ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా "TN140277" అనే హ్యాష్‌ట్యాగ్ ఒకప్పుడు ట్రెండింగ్ కావడం, అభిమానులు ఆ నంబర్ వెనుక ఉన్న కథను ఎమోషనల్‌గా షేర్ చేయడం దీనికి ఉదాహరణ. మొత్తానికి.. కోట్లాది అభిమానులకు దళపతి అయిన విజయ్ మనసులో మాత్రం తన చిన్న చెల్లెలి జ్ఞాపకం ఇంకా అలాగే నిలిచిపోయిందనే విషయం ఈ "0277" నంబర్ మరోసారి గుర్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X