»   »  నాపెళ్ళి ఆపటానికి మీరు 101 కారణం: అభిమానితో త్రిష

నాపెళ్ళి ఆపటానికి మీరు 101 కారణం: అభిమానితో త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు దశాబ్దంపాటు అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగించింది చెన్నై బ్యూటీ త్రిష. ఇక, కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపోదామనుకుంది. ఓ వ్యాపారవేత్తతో పెళ్లి సెటిలయి, నిశ్చితార్థం కూడా అయిపోయింది. అయితే ఏమైందో, ఏమో పెళ్లి పీటలు కూడా ఎక్కక ముందే ఆ వ్యవహారం ముగిసిపోయింది. మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే అంతా అనుకోవటమే గానీ ఖచ్చితమైన కారణం ఇదీ అని మాత్రం ఎవరికీ తెలియదు.

ఆదివారం ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంలో త్రిష తన పెళ్లి గురించి స్పందించారు. మూడు పదుల వయసు దాటినా ఈ చెన్నై సుందరి ఇప్పటికీ టాప్‌ హీరోయిన్‌లలో ఒకరిగా ఉంటున్నారు. పెళ్లి కబురు మాత్రం చెప్పడం లేదు. అయితే ఆదివారం ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంలో త్రిష తన పెళ్లి గురించి స్పందించారు. ఓ అభిమాని 'మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం నేను పెళ్లి చేసుకునేవరకైనా మీరు చేసుకోకండి' అని రిక్వెస్ట్‌ చేశాడు.

Tweet about Trishas Marriage

దీనికి త్రిష బదులిస్తూ 'నేను పెళ్లి చేసుకోకపోవడానికి వంద కారణాలు ఉన్నాయి. నీ రిక్వెస్ట్‌తో ఆ లిస్ట్‌ 101కి చేరింది' అని బదులిచ్చారు. అంటే.. త్రిష పెళ్లి చేసుకోకపోవడానికి నూటొక్క కారణాలు ఉన్నాయన్నమాట. చూస్తుంటే ఈ చెన్నయ్ చంద్రం కూడా మరో రెండు మూడేళ్లు పెళ్లి మాట ఎత్తకుండానే తన పని తాను చేసుకుంటూ గడిపేసేలా ఉంది మరి. అయినా కందకు లేని దురద మనకెందుకూ...
English summary
Trish Krishnan gave a answer to Her fan about her Marriege on her Twitter post
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu