Twist in Tangalaan: తంగలాన్ ట్రైలర్‌లో ఈ ట్విస్ట్ గమనించారా? విక్రమ్ హీరో కాదా?
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్. చాలా కాలంగా మంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విక్రమ్ ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నారు. ఈ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ట్రైలర్ లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ తో పాటు సినిమా స్టోరీ ఏంటి అనే విషయాన్ని కూడా రివీల్ చేశారు. మరి ఈ మూవీ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
విక్రమ్ హీరోగా, మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ అవెయిటింగ్ పీరియాడిక్ మూవీ తంగలాన్. కర్ణాటకలోని గోల్డ్ ఫీల్డ్స్ లోని కొందరు కార్మికుల జీవితాలలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తంగలాన్ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారు. డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా తంగలాన్ ట్రైలర్ రిలీజ్ కాగా, 2024 ఆగస్టు 15న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జోరందుకున్నాయి. అందులో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. సాధారణంగా సినిమాలో హీరోకు విలన్ గా మరో మెయిల్ లీడ్ యాక్టర్ నటిస్తాడు. కానీ ఈ సినిమాలో మాత్రం హీరోను ఆపడానికి హీరోయిన్ ను వాడుకున్నాడు దర్శకుడు. అంటే ట్రైలర్ ను సరిగ్గా గమనిస్తే హీరోకు అడుగడుగునా తనకున్న పవర్స్ తో అడ్డుపడుతుంది హీరోయిన్.
మొత్తానికి ట్రైలర్ ని చూస్తుంటే ఇందులో విక్రమ్ హీరో కాదని, సినిమా అంతా నడిపించేది హీరోయినే అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ చూశాక సినిమా స్టోరీ ఏంటో కూడా ఇట్టే అర్థమైపోతుంది. గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం తవ్వకాలను చేపట్టాలని బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించుకుంటారు. అయితే దానికి సాయం అవసరం కావడంతో దగ్గరలో ఉన్న తెగను సంప్రదిస్తారు.
కొంతమంది మాత్రం అక్కడకు వెళ్లడానికి రెడీ అవుతారు. కానీ మరి కొంతమంది ఆ కొండ దగ్గర దయ్యాలు, పిశాచాలు ఉన్నాయనే నమ్మకంతో అక్కడకు వెళ్లడానికి కూడా భయపడతారు. ఈ నేపథ్యంలోనే హీరో కొంతమందిని వెనకేసుకుని ఆ బంగారు కొండను తవ్వడానికి వెళ్తాడు. కానీ అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది. అయినప్పటికీ వెనక్కి తగ్గని హీరో టీంకు దీని వెనక ఎవరో మాయ, మంత్రాలు చేసే మాంత్రికుడు ఉన్నాడని అనుకుంటారు. కానీ మాంత్రికుడు కాడు మాంత్రికురాలు హారతి ఉందని హీరో కనిపెట్టేస్తాడు.
అప్పుడప్పుడు హీరోకి ఏదో వింత కనిపిస్తున్నట్టుగా అనిపించడం చూస్తుంటే దేవత కలలోకి వచ్చి అతనికేదో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ కి స్పెషల్ సూపర్ నేచురల్ పవర్స్ ఉండటంతో, భవిష్యత్తును తెలుసుకోవడమే కాకుండా ఆ పవర్స్ ని ఉపయోగించి కొండను తవ్వకుండా అడ్డుపడుతుంది. మరి ఆ కొండను తవ్వితే జరిగే పరిణామాలు ఏంటి? అసలు హీరోయిన్ ఎందుకు ఆ కొండను తవ్వకుండా అడ్డుకుంటుంది? హీరో అలా పైశాచికంగా ఎందుకు ప్రవర్తిస్తాడు? అనేది తెరపై చూడాల్సిన స్టోరీ.


Click it and Unblock the Notifications











