Ban Kingdom: తమిళులు స్మగ్లర్లా? మా జోలికి వస్తే తగలబెడుతాం.. విజయ్ దేవరకొండకు తమిళుల వార్నింగ్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించిన కింగ్డమ్ సినిమాపై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ ఈలం కమ్యూనిటీ మనోభావాలను దెబ్బ తీసే విధంగా చిత్రీకరించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నిషేధించాలి అని చెన్నై, కోయంబత్తూరు, ఇతర ప్రాంతాల్లో భారీగా నిరసన, ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సినిమా థియేటర్ల వద్ద ధర్నాలు చేస్తూ పోస్టర్లను చించి దహనం చేస్తున్నారు. ఈ సినిమా వివాదంపై సోషల్ మీడియాలో తమిళ ప్రేక్షకులు ట్వీట్లతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళంలోని శరణార్థ కుటుంబాలకు, శ్రీలంక స్థానికులకు మధ్య జరిగే వైరం ఆధారంగా చేసుకొని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా కింగ్డమ్ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించారు. బ్రదర్ సెంటిమెంట్‌తో మాఫియా కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 31వ గ్రాండ్‌గా రిలీజై భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ క్రమంలో ఈ సినిమాలోని కంటెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ నెటిజన్లు ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుల వివరాల్లోకి వెళితే..

తమిళులు శరణార్థులా? స్మగ్లర్లా? మా కమ్యూనిటీని అలా చూపించడానికి మీకెంత ధైర్యం. అలాంటి కథతో సినిమా తీస్తే.. కేరళ, తెలుగు, మలయాళం వాళ్లు ఇష్టపడుతారా? ఒప్పుకొంటారా? తమిళలంటే అంత చులకనా? ఇది ఏ రకమైన దాడి, అహంకారం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నిషేధించాలి అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు.
మా కమ్యూనిటీ జోలికి వస్తే.. మా మనోభావాలు దెబ్బ తినేలా సినిమాలు తీస్తే.. పోస్టర్లు మాత్రమే కాదు.. స్క్రీన్లను కూడా తగలబెడుతాం. మాతో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కింగ్డమ్ సినిమాను బ్యాన్ చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వ్యాపించాయి. కోయంబత్తూరులోని కేజీ థియేటర్ వద్ద నిరసన, ఆందోళన కార్యక్రమాన్ని తమిళ సంఘాలు చేపట్టాయి. ఈలం తమిళలను అవమానిస్తే సహించం అని తమిళ సంఘాలకు చెందిన కార్యకర్తలు హెచ్చరించారు. అలాగే ఈలం కార్యకర్తలకు చెందిన కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు.
ఈలం తమిళలను కించపరిచే విధంగా సినిమాలు తీసే వారిని గట్టిగా అడ్డుకోవాలి. తప్పుడు రీతిలో ఇలాంటి సినిమాలు తీస్తే.. మీరు అంగీకరిస్తారా? మీరు ఒప్పుకొంటారా? ఆమోదిస్తారా? తమిళ ఈలం, శ్రీలంకలోని తమిళుల మనోభావాలను కించపరిచే విధంగా తీసిన సినిమా కింగ్డమ్‌ను నిషేధించాలి అని తమిళ సినిమా ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు.
తమిళలు, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? విజయ్ దేవరకొండ. మీరు చెమ్మనికి వెళ్లి వాస్తవ ఏమిటో తెలుసుకోండి. శ్రీలంకలో తమిళలను దారుణ హత్య చేసినట్టే.. తమిళ ప్రజలంటే డైరెక్టర్, హీరోకు ఎందుకంత విద్వేషం. మా మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఈ సినిమాను తీయడానికి ఎవరు డబ్బు ఇచ్చారో చెప్పండి.. అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











