రోజుకు 3 లక్షలు, బిగ్ షాట్స్‌తో వ్యభిచారం.. తమిళ నటికి ఆఫర్, కథ ముగించిన పోలీసులు!
Recommended Video

చిత్ర పరిశ్రమల్లో వ్యభిచారం కేసులు ఎక్కువవుతున్నాయి. ఇటీవల అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ సంచలనం రేపింది. హీరోయిన్లకు డాలర్లు ఎరవేసి వ్యభిచారం ఊబిలోకి దించిన ఉదంతం బట్టబయలైన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఓ తమిళ నటిని వ్యభిచారంలోకి దించాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. పలు టివి సీరియల్స్, చిత్రాల్లో నటిస్తున్న తమిళ నటి జయ లక్ష్మికి ఈ చేదు అనుభవం ఎదురైంది.

అసభ్యకరమైన సందేశాలు
నటి జయ లక్ష్మికి గత నెల నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అసభ్యకరమైన సందేశాలు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాము ఓ రిలేషన్ షిప్ లింక్ సైట్ నడుపుతున్నామని జయలక్ష్మికి మెసేజ్ పెట్టారు.

రోజుకు 3 లక్షలు
ఈ సైట్ లో లాగిన్ అయితే బిగ్ షాట్స్ తో వ్యభిచారం చేసే అవకాశం ఉంటుందని, తమ సైట్ పూర్తిగా సేఫ్ అని ఆ మెసేజ్ లో ఉంది. తమ క్లైంట్స్ బడా వ్యక్తులని, వ్యభిచారం ద్వారా రోజుకు 3 లక్షలు సంపాదించే అవకాశం ఉటుందని జయలక్ష్మికి గాలం వేయడానికి ప్రయత్నించారు.

నంబర్ బ్లాక్ చేసినా
జయలక్ష్మి ఆ సందేశాన్ని పట్టించుకోకుండా నంబర్ బ్లాక్ చేసింది. అయినా కూడా మరో నంబర్ నుంచి రెండు రోజుల తరువాత సందేశాలు రావడం మొదలైంది. దీనితో విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆట కట్టించిన పోలీసులు
జయలక్ష్మి గత వారం చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా శుక్రవారం రోజు నగర పోలీసులు ఆ నంబర్స్ ద్వారా నిందితులని పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. మురుగ పెరుమాళ్, కవియరసన్ అనే ఇద్దరు జయలక్ష్మికి సందేశాలు పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.


Click it and Unblock the Notifications











