ఇక చూడండి 'అల్లాడిస్తా': ఉదయ్ కిరణ్
వరస ప్లాపులతో లైమ్ లైట్ లో లేకుండా పోయిన ఉదయ్ కిరణ్ మరో సారి 'అల్లాడిస్తా' అంటూ వస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో అతని సరసన మీరాజాస్మిన్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఈ చిత్రానికి మరో విశేషం ఉంది. అది తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కథ అందించడం. ఈ చిత్రం గురించి దర్శకుడు బాలి శ్రీరంగం మాట్లాడుతూ...కరుణానిధి సమకూర్చిన కథే ఈ సినిమాకి ప్రధాన బలం. ఉదయ కిరణ్ ఇందులో ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. నిజాయితీ గల ఆఫీసర్ వృత్తిపరంగా ఎదుర్కొనే ఇబ్బందులు, ఐ.పి.ఎస్.ఆఫీసర్ కావాలనే హీరోయిన్ ఆశయానికి హీరో ఎలా తోడ్పడ్డాడన్నది ఈ చిత్రంలోని ముఖ్య అంశాలు. ఎక్కువ భాగం అడవిలోనే సాగుతుంది. ప్రేమతోపాటు యాక్షన్‌కీ ప్రాధాన్యమిచ్చాం. లారెన్స్, లక్ష్మీరాయ్ లపై చిత్రీకరించిన పాట అదనపు ఆకర్షణ అన్నారు. తెలుగు వెర్షన్ కి కె.రోహిత్ నిర్మాతగతా వ్యవహిస్తున్నారు. త్వరలో ఆడియోను రిలీజ్ చేసి, జూన్ లో చిత్రాన్నీ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. రేవతి, రంభ ముఖ్య పాత్రల్లో కనిపించే ఈ చిత్రానికి ఎడిటింగ్..వి.టి.విజయన్, సంగీతం..దేవా, పాటలు...వెన్నెలకంటి, మాటలు..వెంకట్ మల్లూరి, ఛాయాగ్రహణం..విజయ్ రాఘవ్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











