twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముఖ్యమంత్రి స్క్రీన్ ప్లేతో ఉదయ్ కిరణ్

    By Staff
    |

    Uday Kiran
    గుండె ఝల్లుమంది, ఏకలవ్యుడు చిత్రాలతో దాదాపు కెరీర్ పరిసమాప్తి అనుకున్న ఉదయ్ కిరణ్ మళ్ళీ మరో సినిమా పట్టాడు. అయితే ఆ సినిమా తమిళంలో ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రానికి ఉన్న స్పెషల్ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కథ, స్క్రీన్ ప్లే అందించటం. నందినీ ఆర్ట్స్ వారు నిర్మించే ఈ చిత్రానికి Ilavenil దర్శకత్వం వహిస్తున్నాడు. మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఉదయ్ కి తోడుగా మీరా జాస్మిన్ చేస్తోంది. ఇంతకు ముందు బాలచందర్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ పోయ్ అనే చిత్రంలో చేసారు. అది తెలుగులో అబద్దం పేరుతో రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి చిత్రాలతో కెరీర్ ప్రారంభంలోనే హాట్రిక్ కొట్టిన ఈ హీరో ఇప్పుడు తెలుగులో ఏ సినిమానూ కమిట్ కాలేదు. తనకు తగ్గ పాత్రలు రానందునే గ్యాప్ అని మంచి కథ రాగానే సినిమా ప్రారంబిస్తానని ఉదయ్ కిరణ్ చెప్తూ వస్తున్నారు. మరి ఈ సినిమా అన్నా అతని కెరీర్ ని మళ్ళీ గాడిలో పెడ్తుందేమో చూద్దాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X