twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అధికార పార్టీ పగపట్టి తన సినిమాలు ప్లాఫ్ చేస్తోందంటూ స్టార్ హీరో

    By Srikanya
    |

    తమిళ సూపర్ స్టార్ విజయ్ చిత్రాన్ని విడుదల కానివ్వకుండా చేసి ఉదయనిధి సొంత సినిమా కమలహాసన్ నటించిన మన్మధన్ అన్బు(మన్మధ బాణం) విడుదల చేయిస్తున్నారని కోలీవుడ్ లో అంతటా వినపడుతోంది..దీంతో విజయ్ తీవ్ర మన స్తాపం చెంది, జయలలిత సహాయం కోరనున్నట్లు తెలిసింది. ఇందునిమిత్తం వచ్చే ఎన్నికల్లో తాము అన్నాడీఎంకేకు మద్దతు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అకస్మాత్తుగా విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. విజయ్ నటించిన కావలన్ చిత్రం కొంత కాలంగా విడుదలకు కావటంలేదు. అంతేగాకుండా ఆయన నటించిన చిత్రాలు వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. అందులో డిస్ట్రిబ్యూటర్స్ కుట్ర ఉందని విజయ్ అనుమానిస్తున్నారు. అంతేగాక తనీ స్ధితికి అధికార పార్టీ తనపై పగ పట్టడమే కారణమని విజయ్ భావిస్తున్నారు.

    కరుణానిధి మనుమడు, ఉప ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఇటీవల తమిళ సినిమా పరిశ్రమలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయనకు, విజయ్‌కు ఇటీవల గొడవలు జరిగినట్లు సమాచారం. దీంతో కావలన్ చిత్రం విడుదల కాకుండా ఉదయనిధి ప్రయత్నిస్తున్నారని ఆయన భావిస్తున్నారు. ఈ చిత్రానికి అడ్డుపుల్ల వేసేందుకు ఉదయనిధి డిస్ట్రిబ్యూటర్లతో కుమ్మక్కు అయ్యారని తెలిసింది.దాంతో విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎక్కడిక్కడ ఆయనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆయన్ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలని డీఎంకే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో విజయ్ ఇటీవల తన అభిమానులతో సమావేశమయ్యారు.

    వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు తెలి సింది. ఈ మేరకు ఆయన ఆ పార్టీ అధినేత్రి జయలలితకు సందేశం పంపనున్నట్లు సమాచారం.తన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎ.చంద్రశేఖరన్‌ను జయలలిత వద్దకు పంపే ఆలోచనలు ఉన్నారు. ఈ విషయాన్ని అన్నాడీఎంకే నాయకులు కూడా ధ్రువీకరించారు. చంద్రశేఖర్ జయలలిత అపాయింట్‌మెంట్‌ను కోరి నట్లు సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X