షాకింగ్ : కాజల్ పై యంగ్ హీరో కంప్లైంట్
హైదరాబాద్ : తమిళ,తెలుగు భాషల్లో హీరోయిన్ గా వెలుగుతున్న హీరోయిన్ కాజల్ పై యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ కంప్లైంట్ చేసారు. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఈ కంప్లైంట్ ని నమోదు చేసారు. తనతో నటించవలిసిన చిత్రం 'Nanbaenda'చిత్రం కు అడ్వాన్స్ తీసుకుని డేట్స్ ఇవ్వలేదని ఆ కంప్లైంట్ లో రాసారు. కాజల్ నలభై లక్షలు అడ్వాన్స్ తీసుకుందని అవి తిరిగి వాపసు చేయాలని కోరారు.

కాజల్ మాట్లాడుతూ... " పారితోషికం అనేది నాకెప్పుడూ సమస్య కాలేదు. నా పారితోషికంతో నిర్మాతలెవరూ ఇబ్బంది పడలేదు. అలా అయితే నేను తమిళంలో బిజీగా ఉండేదాన్ని కాదు కదా. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం'' అని చెప్పింది కాజల్ అగర్వాల్.


Click it and Unblock the Notifications