బెడ్ రూమ్ ఉంది కానీ సీన్స్ లేవంటున్న తమిళతార

ఈ చిత్రంలో పడక గది సన్నివేశాల్లో ఆమె ఎక్కువ గ్లామర్‌గా నటించినట్లు వార్తలు ప్రసారమవుతున్నాయి. దీని గురించి ఉదయతారను వివరణ కోరగా విలై చిత్రంలో వ్యభిచార యువతి పాత్రలో నటించిన మాట వాస్తవమేనన్నారు. అయితే పడక గది సన్నివేశాలు అందులో లేవని స్పష్టం చేశారు. యువకులకు అవగాహన కలిగించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొం దినట్లు తెలిపారు. గ్రామీణ యువతినైన తాను కొం దరు దళారుల చేతిలోపడి వ్యభిచార గృహానికి వెళ్లాల్సి వస్తుందని అన్నారు.
అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటానని చెప్పారు. తన పాత్రలో నెగటివ్ ఛాయలేమీ ఉండవని తెలిపారు. అయితే సెంటిమెంట్ సన్నివేశాలు చాలా ఉంటాయన్నారు. ఈ చిత్రంలో తనతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని, వారు అలాంటి సన్నివేశాల్లో నటించారేమో తనకు తెలియదని ఉదయతార అన్నారు.


Click it and Unblock the Notifications











