twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో ఉదయనిధి స్టాలిన్‌పై దొంగతనం కేసు.. ఏం దొంగతనం చేశాడో తెలుసా? వైరల్‌గా వీడియో

    |

    తమిళ సినీ నటుడు, డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదైంది. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకొన్నది. ఉదయనిధి స్టాలిన్‌పై దొంగతనం కేసు నమోదు చేయడం ఇప్పడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాకుండా రాజకీయ బహిరంగ సభలో ఉదయనిధి మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో వెనుక అసలు కథ ఏమిటంటే...

    పాలిటిక్స్‌లోకి ఉదయనిధి స్టాలిన్

    పాలిటిక్స్‌లోకి ఉదయనిధి స్టాలిన్


    సినీ నటుడుగా రాణిస్తున్న ఉదయనిధి స్టాలిన్ తండ్రి స్టాలిన్, తాత కరుణానిధి వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల్లో చెన్నైలోని చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

    ప్రచారంలో నిప్పులు చెరిగిన యువనేత

    ప్రచారంలో నిప్పులు చెరిగిన యువనేత

    ఉదయనిధి స్టాలిన తన ప్రచారంలో అధికార ఏఐడీఎంకే, ప్రధాన పార్టీ బీజేపీపై విమర్శలను ఎక్కుపెడుతున్నారు. సత్తూరులో జరిగిన తన క్యాంపెయిన్‌లో ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటులో జాప్యంపై నిప్పులు చెరిగారు. మధురైలో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్ హాస్పిటల్‌ నిర్మాణ హామీని అధికార పార్టీ తుంగలో తొక్కిందని విమర్శలు చేశారు.

    ఎయిమ్స్ హాస్పిటల్‌ ఇటుకను చూపిస్తూ..

    ఎయిమ్స్ హాస్పిటల్‌ ఇటుకను చూపిస్తూ..

    ఉదయనిధి స్టాలిన్ తన ప్రచారంలో ఎయిమ్స్ హాస్పిటల్ శంకుస్థాపన వద్ద ఉన్న ఇటుకను చూపిస్తూ.. మధురైలో ఎయిమ్స్ ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైంది. అక్కడ కేవలం ఇటుకలు మాత్రమే మిగిలాయి. 250 ఎకరాలు కేటాయించినా.. గత మూడేళ్లలో ఏఐడీఎంకే, బీజేపీ తమ హామీని అమలు చేయడంలో దారుణంగా విఫలమైంది అంటూ ముఖ్యమంత్రి పళనిస్వామిపై విమర్శలు గుప్పించారు. దాంతో ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

    ఇటుక దొంగిలించాడని కేసు

    అయితే ఉదయనిధి స్టాలిన్ చూపించిన ఇటుక ఇప్పుడ రగడ మొదలైంది. ఉదయనిధి ప్రతిపాదిత ఎయిమ్స్ ప్రదేశం నుంచి ఇటుక దొంగిలించాడు అంటూ బీజేపీ కార్యకర్త కేసు నమోదు చేశాడు. 2019లో ప్రధాని నరేంద్రమోదీ ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి పునాది వేశారు.

    బీజేపీపై ఉదయనిధి విమర్శలు

    బీజేపీపై ఉదయనిధి విమర్శలు


    అయితే తనపై బీజేపీ కార్యకర్త కేసు నమోదు చేయడంపై ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ఎయిమ్స్ క్యాంపస్ నుంచి ఇటుకు దొంగిలించానని ఓ మహానుభావుడు నాపై కేసు నమోదు చేశాడు. దీనిని బట్టి అక్కడ ఇటుకలు తప్ప మరోటి లేదని, వారి వైఫల్యానికి ఇటుకలే సాక్ష్యం అని ఉధయనిధి దుయ్యబట్టారు.

    English summary
    Actor turned politician Udhayanidhi ​Stalin faces police case over stealing brick from AIIMS campus in Madurai. BJP Worker files a case on Udhayanidhi for Stealing the brick from proposed AIIMS campus from Madurai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X