twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నికల బరిలోకి యువ హీరో.. తాత, తండ్రి బాటలో.. ఎక్కడ నుంచి పోటీ అంటే!

    |

    రాజకీయాల్లోకి సినీ నటులు ప్రవేశించడం కొత్తేమీ కాదు. కాకపోతే పాలిటిక్స్‌ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయనిధి స్టాలిన్ రానున్న తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఉదయనిధి స్టాలిన్ రాజకీయ ప్రవేశం గురించి వివరంగా...

    సినీ రంగం నుంచి రాజకీయ వారసత్వం

    సినీ రంగం నుంచి రాజకీయ వారసత్వం

    భారత రాజకీయాల్లో చక్రం తిప్పిన కురువృద్దుడు, స్వర్గీయ ఎం కరుణానిధి మనవడు, ప్రస్తుతం తమిళ పాలిటిక్స్‌లో తనదైన ముద్రతో దూసుకెళ్లున్న ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి అనే విషయం తెలిసిందే. ఉదయనిధి సినిమాల్లో నటిస్తూనే రాజకీయాలపై ఆసక్తిని చూపిస్తున్నారు.

    కొంటె చూపులతో కవ్విస్తోన్న కోలీవుడ్ భామ అనన్యామణి ఫొటోలు

    ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ

    ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ

    డీఎంకే పార్టీ యువజన విభాగానికి అధినేతగా తన మార్కు చూపిస్తున్న ఉదయనిధి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఘాటుగా తిప్పి కొడుతూ తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల బరిలోకి దూకేందుకు ఉదయనిధి స్టాలిన్ సిద్ధమయ్యారు.

    డీఎంకే పార్టీ వారసుడిగా

    డీఎంకే పార్టీ వారసుడిగా

    తమిళనాడులో వేడిక్కిన రాజకీయ వాతావరణంలో ఉదయనిధి పోటీ వార్త మరింత కాకను పుట్టించింది. ఏప్రిల్ 6వ తేదీన జరిగే ఎన్నికల కోసం సర్వం సిద్ధంగా ఉన్న సమయంలో డీఎంకే పార్టీకి వారసుడి ఎంపిక యాదృచ్ఛికంగా జరిగిపోయింది.

    చెన్నైలోని చెపాక్ నియోజకవర్గం నుంచి

    చెన్నైలోని చెపాక్ నియోజకవర్గం నుంచి


    తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2021 కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది. ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. రానున్న ఎన్నికల్లో ఉదయనిధి ఏ రేంజ్‌లో విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

    ఉదయనిధి స్టాలిన్ కెరీర్

    ఉదయనిధి స్టాలిన్ కెరీర్


    ఉదయ నిధి స్టాలిన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. 2009లో అధవన్ చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఓరు కాల్ ఓరు కన్నది, వణక్కం చెన్నై, నాన్‌బెందా, కన్నై నంబథే, ఏంజెల్ చిత్రాల్లో నటించారు. గత దశాబ్ద కాలంలో దాదాపు 15 చిత్రాల్లో నటించారు.

    English summary
    Tamil Actor Udhayanidhi Stalin into Tamil Politics. As per reports, He is going to contest from Chepauk in Chennai. Tamilnadu Elections are slated on April 6th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X