twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అన్న' టిక్కెట్ దొరకలేదని ఆత్మహత్య

    By Srikanya
    |

    కోయంబత్తూరు : మొన్న శుక్రవారం మనకు తమిళ హీరో విజయ్ నటించిన 'అన్న' సినిమా రిలీజైన సంగతి తెలిసిందే . అయితే తమిళనాడులో ఈ చిత్రం రిలీజ్ కాలేదు. ఈ చిత్రం చూడలేకపోయానన్న ఆవేదనతో తమిళనాడులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం విజయ్ వీరాభిమాని అయిన విష్ణు(20) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుంటాడు. అతను కోయంబత్తూరు శివర్లలోని తుడియాలూరు ప్రాంతంలో నివసిస్తుంటాడు.

    ఇక అ న్న సినిమా ఈ శుక్రవారమే తమిళనాడులో విడుదల కావాల్సి ఉండగా రాజకీయ కారణాలతో వాయిదా పడింది. దీంతో విష్ణు చాలా ఆవేదన చెందాడు. ఎలాగైనా సినిమా చూడాలన్న ఉద్దేశ్యంతో అతను ఇక్కడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళ రాష్ట్రంలోని వేలాంతవాళం అనే ఊరు వెళ్లాడు. కానీ, అతనికి అక్కడ టిక్కెట్ దొరకలేదు. దాంతో తీవ్ర నిరాసచెంది, కోయంబత్తూరు తిరిగి వచ్చేసాడు. కానీ తిరిగి వచ్చాక తెల్లవారు ఝామున తన ఇంట్లోని సీలింగ్ కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నిర్మాతలకు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం నుంచి బెదిరింపులు రావటంతో అన్న సినిమా తమిళనాడులో ఆగిపోయింది.

    ఇక రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో అనిశ్చితి పరిస్దితి ఉండటంతో తెలుగు స్ట్రైయిట్ పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్ ని మార్చుకుని వెనక్కి వెళ్లాయి. దాంతో తమిళ 'తలైవా' డబ్బింగ్ తో విజయ్ ...'అన్న' గా ధియోటర్లలోకి ఉత్సాహంగా దిగింది. సరైన పోటీ లేకపోవటంతో అంతా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ తో అదరకొడుతుందనుకుని ట్రేడ్ లో అంచనాలు వేసారు. అయితే విజయ్ కు పెద్దగా ఇక్కడ మార్కెట్ లేకపోవటం,పబ్లిసిటీ సరిగా చేయకపోవటంతో ఓపినింగ్స్ సైతం తెచ్చుకోలేకపోయింది. పోనీ సినిమా బాగుంటే మౌత్ టాక్ తో ముందుకు వెళ్తుందనుకుంటే బ్యాడ్ స్క్రీన్ ప్లే సినిమాను బోర్ గా మార్చేసింది.

    'అన్న' గా మారకముందు,మారిన తర్వాత కథలోనూ, టెంపో లోనూ ఏ మార్పు లేకపోవటంతో కథనం నిరుత్సాహపరిచింది. అందులోనూ స్లో నేరేషన్ , ఎన్నో సార్లు చూసిన సీన్స్ మరోసారి రిపీట్ అవటంతో కూడా ప్రేక్షకుడుకి తర్వాతేం ఏం జరుగుతుందో తేలిగ్గా ఊహించేలా ప్రెడిక్టిబుల్ గా మార్చేసి..ఆసక్తిని చంపేసాయి. దర్శకుడు షాట్స్,రిఫెరెన్స్ సినిమాల పై పెట్టిన శ్రద్ద కథ,కథనాలపై కూడా పెట్టి ఉండే బాగుండేది అనిపిస్తుంది. అయితే నటీనటులు ఫెరఫార్మెన్స్ పరంగానూ, టెక్నికల్ గానూ మంచి స్టాండర్డ్స్ లో ఉంది.

    English summary
    A 20-year-old fan of a Tamil actor Vijay allegedly committed suicide here for allegedly being dejected over not being able to watch the latter's new film "Thalaivaa", whose release has been stalled in the south Indian state in the backdrop of some threats, police said on Sunday. According to local police, Vishnu, a construction worker, was upset over the non-release of the film on Saturday. He had even gone to Velanthavalam in neighbouring Kerala, about 30 km from here, to watch the movie, they said quoting his friends and family sources.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X