షకీలాకు చంపేస్తామంటూ వార్నింగ్
సెక్స్ బాంబ్ షకీలాను చంపేస్తామని బెదిరింపులు రావటంతో ఆమె కంగారుపడుతోంది. గత నాలుగు రోజులుగా ప్రముఖ శృంగార తార షకీలాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆమె తమిళంలో తాజాగా ఓ చిత్రంలో సన్యాసిని పాత్ర పోషిస్తోంది. నకిలీ సన్యాసుల నుంచి అమాయక ప్రజలను ఎలా రక్షించాలి అనే ఇతివృత్తంలో తెరకెక్కుతున్న 'ఆసాయి' సినిమాలో షకీలా నకిలీ సన్యాసిని పాత్రలో నటిస్తోంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు తనకు గత అయిదు రోజులుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తనకు ఫోన్ చేసి చాలా కఠినంగా మాట్లాడుతున్నాడని, ఆసాయి చిత్రం విడుదలైతే నువ్వు బయటకు తిరగలేవని బెదిరిస్తున్నాడని వాపోయింది.
అయితే తాను మాత్రం ఏమాత్రం ఆ బెదిరింపులకు భయపడలేదని నటన తన వృత్తి కాబట్టి, ఎలాంటి పాత్రలు చేయటానికైనా సిద్ధమని, ధైర్యముంటే తన ఎదుటకు వచ్చి మాట్లాడాలని ఆ ఆగంతకుడికి చెప్పినట్లు షకీలా తెలిపింది. తనతో చాలా అసభ్యంగా మాట్లాడాడని, అయితే అలాంటి బెదిరింపులకు తాను లొంగేరకం కాదని ఆమె స్పష్టం చేసింది. ఇక షకీలా ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయటం లేదు. తెలుగులో అయితే ఆఫర్స్ లేవు. తమిళంలో అడపాదడపా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











