»   » సినిమా జ్యోతిషం ఫన్ గేమ్‌, ఇదిగో లింక్

సినిమా జ్యోతిషం ఫన్ గేమ్‌, ఇదిగో లింక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై:సినిమా ప్రమోషన్ లో భాగంగా గేమ్ లు విడుదల చేయటం గతంలో హాలీవుడ్ సినిమాలకు జరిగేది. తర్వాత హిందీ చిత్రాలకు వాడటం మొదలెట్టారు. ఇప్పుడు అది తెలుగు,తమిళలకు సైతం పాకింది. తాజాగా అలాంటి గేమ్ ని ఒకదాన్ని తమిళ హీరో ఆర్య విడుదల చేసారు.

వివరాల్లోకి వెళితే...'ఉరుమీన్‌'కు సంబంధించి చిత్రయూనిట్‌ ఓ జ్యోతిష్య గేమ్‌ను రూపొందించింది. దీన్ని నటుడు ఆర్య విడుదల చేశారు. ఇందులో పుట్టినతేదీ తదితర వివరాలను ప్రస్తావిస్తే గత జన్మలో ఏం ఉద్యోగం చేసేవారు, తదుపరి జన్మలో ఏ పని చేస్తారోనన్న విషయాలను చెబుతుందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

గేమ్ లింక్...

Urumeen's Prediction Game launched by ARYA

ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్న బాబిసింహా నటించిన మరో విభిన్న కథా చిత్రం ఉరుమీన్. యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత డి.ఢిల్లీబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శక్తివేల్ పెరుమాళ్‌స్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రేష్మిమీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గురించి బాబిసింహా తెలుపుతూ ఇది ఒక థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు.

లవ్, యాక్షన్‌తో పాటు చిన్న ఫాంటసీ సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటాయన్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు గ్రామం నుంచి చెన్నై మహానగరానికి వస్తాడని అక్కడ అతను ఎదుర్కొనే సమస్యలే చిత్ర కథ అని తెలిపారు. ఈ చిత్రంలో అన్ని అంశాలు వేరే ట్యూన్‌లో ఉంటాయని చెప్పారు. దీనికి అచ్చు రోజామణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Urumeen's Prediction Game launched by ARYA

భిన్నమైన నటనతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు బాబిసింహా. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన పేరు బాబిసింహా చేసింది నాలుగే నాలుగు చిత్రాలు. వీటికి జాతీయస్థాయి గుర్తింపు. ఇది నిజంగా అరుదైన అంశమే.

పిజ్జాతో నటనకు శ్రీకారం చుట్టిన ఈ యువ నటుడు ఆ తరువాత నేరం, సూదుకవ్వుం చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నాలుగవ చిత్రం జిగర్‌తండా బాబిసింహా పేరును జాతీయస్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో నటనకుగాను బాబి ఉత్తమ సహాయనటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు.

English summary
Arya launched UrumeenPredictions‬ Game. This movie is said to be based on real story occurred in 1700 A.D. This movie is a revenge concept, so Bobby and Kalai are acting against each other where the tagline says “The revenge is always ultimate”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu