అదిరింది: ‘ఉత్తమ విలన్’ అఫీషియల్ ట్రైలర్

By Bojja Kumar

హైదరాబాద్: కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన వారిలో కమల్ హాసన్ ఒకరు. ఆయన ఏ సినిమా తీసినా ప్రత్యేకంగా ఉంటుంది. త్వరలో కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ‘పొంగల్' పండగ నేపథ్యంలో ‘ఉత్తమ విలన్' అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రస్తుతం ఇది తమిళంలో మాత్రమే విడుదల చేసారు.

కమల్‌హాసన్‌ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘ఉత్తమవిలన్‌'. తెయ్యమ్‌ కళాకారుడిగా, సినిమా నటుడిగా కమల్‌హాసన్‌ రెండు పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్‌ సంస్థ పై లింగుస్వామి నిర్మిస్తున్నారు. పూజాకుమార్‌, ఆండ్రియా, పార్వతి హీరోయిన్లు. రమేష్‌ అరవింద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా ఇది.

షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరిలో ఆడియో విడుదల కానుంది. ఇటీవల కన్నుమూసిన కమల్ హాసన్ గురువు, ప్రముఖ దర్శకుడు బాలచందర్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.

ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకే పరిమితం కాకుండా...స్క్రిప్టు వర్క్, డైలాగ్స్ కూడా రాసారట. ఈ చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ ఈ విషయాలను తెలియజేసారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం.

Uttama Villain official trailer

ఈ చిత్రంలో కమల్ హాసన్ పోషిస్తున్న మనోరంజన్ పాత్రకు భార్యగా ఊర్వశి నటిస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.విశ్వనాథ్ మనోరంజన్ మామ పాత్రను పోషిస్తున్నారు. హీరోయిన్ ఆండ్రియా మనోరంజన్ ప్రియురాలి పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో మనోరంజన్ పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.

8వ శతాబ్దం బ్యాక్ డ్రాపులో నడిచే కథలో... నాజర్, ముత్తరాజన్, జయరాం, పార్వతి మెల్టన్, ఎంఎస్ భాస్కర్ కనిపించనున్నారు. మొత్తానికి ఈచిత్రం కమల్ హాసన్ నుండి వస్తున్న మరొక వైవిద్యమైన చిత్రం. ఉత్తమ విలన్ చిత్రానికి కన్నడ యాక్టర్, డైరెక్టర్ రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఎన్ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎం ఘిబ్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్యాం దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కమల్ హాసన్‌తో కలిసి సహజీవనం చేస్తున్న గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X